వైఎస్ జగన్ పరువు నష్టం దావా కేసు- ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు
వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారంటూ ఆ రెండు పత్రికలపై వైఎస్ జగన్ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అదానీ గ్రూప్ అవినీతి కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు […]