సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన కే విజయానంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) కె.విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సాయంత్రం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా పని చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను ఏపీ నూతన సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29న జీఓ జారీ చేసిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. […]
నాకు ప్రజలే హైకమాండ్ : చంద్రబాబు
పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని, పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి, జనాన్ని బలవంతంగా తరలించేవారని, తాను అలాంటి సీఎం కాదని, సాదాసీదాగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులు చూసుకోవడమే తన బాధ్యత అని అన్నారు. తనకు హైకమాండ్ అంటూ ఏం లేదని, 5 కోట్ల ప్రజలే తనకు హైకమాండ్ అని […]