20 లక్షల కుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలి : చంద్రబాబు

రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ – పీ4 విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ4లో భాగస్వాములు కావొచ్చని.. గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే పీ4 కార్యక్రమానికి […]
పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు

ఏపీలో వృద్ధులకు, దివ్యాంగులకు, ఇతర వర్గాలకు పంపిణీ చేస్తున్న పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. మార్చి నెలకు గాను ఇచ్చే పెన్షన్లలో ఈ మార్పులు వర్తింపచేయనున్నారు. పెన్షనర్ల సౌలభ్యం కోసం ఈ మార్పులు చేస్తున్నట్లు సెర్ఫ్ సీఈవో వాకాటి కరుణ తెలిపారు. ఇందులో టైమింగ్స్ మార్పు సహా పలు అంశాలున్నాయి. పెన్షన్ల పంపిణీలో నాణ్యత, పెన్షన్ దారుల సంతృప్తి మెరుగుపర్చేందుకు పెన్షన్ల పంపిణీ యాప్ లో పలు మార్పులు చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇందులో […]
పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు

వచ్చే విద్యా సంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని ఆర్థిక శాఖకు ఏపీ కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. పీఎం కిసాన్‌కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో సూపర్ సిక్స్ పథకాలపై చర్చ జరిగింది. […]
నూతన సంవత్సరం తొలిరోజున 2 వేల మందిని కలిసిన చంద్రబాబు

నూతన సంవత్సర తొలిరోజున దాదాపు 2 వేల మందిని కలిసిన సిఎం చంద్రబాబు 1,600 మంది పేదలకు రూ.24 కోట్లు విడుదల చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకంతో నూతన సంవత్సరం మొదటి రోజు తన ప్రారంభించిన సిఎం చంద్రబాబు. @10.45am – టీటీడీ అర్చకులతో ఆశీర్వాదం తీసుకున్న సీఎం చంద్రబాబు. @11 am- ఉదయం ఇంట్లో ఐఎఎస్,ఐపిఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చిన సిఎం. @12.20- తరువాత దుర్గగుడిలో […]
ఐదు అంతస్తుల వరకు అనుమతులు అవసరం లేదు: మంత్రి నారాయణ

పట్టణ ప్రాంతాల్లో ఐదు అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. లేఅవుట్, భవనాలకు సంబంధించి మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తే అనుమతులు వస్తాయని చెప్పారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసి అనుమతులు పొందవచ్చని తెలిపారు. ఇతర శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పట్టణాల్లో రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, వరదనీరు, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై 15 రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని […]
ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు

ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు. […]
కూటమి పాలనా? కుటుంబ పాలనా?

అన్నం ఉడికిందా లేదా అని చెప్పడానికి ఒక మెతుకు పట్టుకొని చుస్తే ఇట్టే తెలిసిపోతుంది. అలాగే కూటమి ప్రభుత్వ పోకడ ఎలా ఉండో ఆరు నెలల పాలన చూస్తే తెలిసిపోతూ ఉంది. 1. కూటమి పాలనా లేక కుటుంబ పాలనా? ఇది సకుటుంబ కథాచిత్రం. నడుస్తున్నది కూటమి ప్రభుత్వం కాదు రెండు కుటుంబాల ప్రభుత్వం అని అందరి నోళ్ళల్లో నానుతున్న మాట. గత జగన్ పాలనలో ఎన్నో కష్ట నష్టాలకోర్చి ఎన్నికల్లో గెలిచాక చంద్రబాబు కొడుకు లోకేష్ […]
తల్లితండ్రులు చనిపోయిన పిల్లలకు పింఛన్

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛను అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గురువరం కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఈ విషయాన్ని ప్రకటించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలను సేకరించాలని, వారికి వెంటనే పింఛన్‌లు అందించే దిశగా చర్యలు చేపట్టాలని సమావేశంలో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ప్రతి ఏటా ఈ జాబితాను సిద్దం చేసి అప్‌డేట్ చేయాలన్నారు. […]
చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీపై ఆసక్తి నెలకొంది. సోమవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లంచ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. తన డిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకు పవన్ చెప్పినట్లు సమాచారం. వీటితో పాటు సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవులపై కూడా ఇరువురి మధ్య జరిగినట్లు తెలిసింది ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి […]
నా పాలన ఎలా ఉందో చెప్పండి : చంద్రబాబు

తన పాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎపీ సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS (Interactive Voice Response System) ఫోన్లు చేసి అమలు తీరును తెలుసుకుంటామని ప్రకటించారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల […]