ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ : గంటా నిర్వేదం

టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం నుంచి అమరావతి వెళ్లడానికి పడే ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ నిర్వేదం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ’ అంటూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో […]
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం ప్రారంభమైంది. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి కొచ్చి రిజిస్ట్రేషన్ […]