బాలయ్య స్టైల్ రగడ– చిరు క్లాస్ కౌంటర్

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టించాయి. బాలయ్య కెలికిన రచ్చకు చిరంజీవి లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో, ఈ ఇష్యూ సోషల్ మీడియా నుంచి సామాన్యుల చర్చల వరకూ వైరల్ అయ్యింది. అసెంబ్లీలో బాలయ్య ఫైర్: “ఎవడు గట్టిగా అడిగాడు?” శాసనసభలో శాంతిభద్రతల అంశంపై చర్చ జరుగుతుండగా, బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్, జగన్ […]
చిట్టగాంగ్‌ను చేరిస్తే బంగళాఖాతం వరకూ ఈశాన్య భారతమే

ఎంతటి బలవంతుడికైనా ఓ బలహీనత ఉంటుంది… ఆ బలహీనతను శత్రువు గుర్తిస్తే పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే… తన బలహీనతను శత్రువు గుర్తించాడని తెలిసి కూడా సరిదిద్దుకోకపోతే స్వయంకృతాపరాధమే.ఈ సూత్రం దేశ రక్షణ వ్యవహారాలకు మరింత ఎక్కువగా వర్తిస్తుంది. అందుకు భారతదేశం కూడా మినహాయింపు కాదు. మరి వ్యూహాత్మకంగా భారత్ బలహీనత ఏమిటీ…!? చికెన్ నెక్ ప్రాంతం. తెలుగులో చెప్పాలంటే కోడిమెడ ప్రాంతం. సెవెన్ సిస్టర్స్ గా పిలిచే ఏడు రాష్ట్రాలను మిగిలిన భారత దేశంతో […]
ఏపీ కేబినెట్ సమావేశం: కీలక నిర్ణయాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో 24 ముఖ్యమైన అజెండా అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్య నిర్ణయాల వివరాలు 1. పరిశ్రమలకు భూమి కేటాయింపు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని ఐటీ హిల్-3 ప్రాంతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) […]
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం ప్రారంభమైంది. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి కొచ్చి రిజిస్ట్రేషన్ […]
తలకోన అడవిలో ఏనుగుల బీభత్సం.. ముగ్గురు మృతి

మహా శివరాత్రి సందర్భంగా కాలినడకన శైవక్షేత్రానికి వెళ్లి శివయ్యను దర్శించుకొందామని వెళ్తున్న భక్తులపై.. మార్గం మధ్యలో గజరాజుల గుంపు దాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా, ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. 26 మంది ప్రాణ భయంతో పరుగు తీశారు. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలో చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులైన భక్తులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శివరాత్రి సందర్భంగా దశాబ్దాలుగా వైకోట నుంచి శేషాచలం దట్టమైన అటవీ మార్గం మీదుగా […]
కోళ్లకు అంతుచిక్కని వైరస్ : లక్షల్లో మృత్యువాత

కోళ్లను మృత్యువాత పడేలా చేస్తున్న అంతుచిక్కని వైరస్ పశ్చిమగోదావరి జిల్లాను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. సాయంత్రం ఆరోగ్యంగా కనిపించే కోడి, తెల్లవారుజామున చనిపోతున్న దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ వ్యాధి కారణంగా ఆ జిల్లాలో ఇప్పటివరకు లక్షకు పైగా కోళ్లు మృత్యువాత పడ్డాయని తెలుస్తోంది. ముఖ్యంగా పందేలు కోసం ప్రత్యేకంగా పెంచిన కోళ్లు కూడా వైరస్ బారిన పడి మరణించాయి. దీంతో కోళ్ల పెంపకందారులు భారీ నష్టాలు ఎదుర్కొంటున్నారు. ఇదే వైరస్ నాలుగేళ్ల క్రితం కూడా పశ్చిమగోదావరిలో […]
మాట వినలేదా? నచ్చలేదా? ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీల్లో ట్విస్టులు

ఏపీలో భారీగా జరిగిన ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏరికోరి కీలక పోస్టుల్లో కూర్చోబెట్టిన కొందరు అధికారులను ఈ బదిలీల్లో అంతగా ప్రాధాన్యత లేని పోస్టుల్లోకి పంపారు. పూర్తిగా జగన్ మనషులుగా ముద్ర వేసిన పలువురు అధికారులకూ పోస్టింగ్‌లు లభించాయి. అధికారం చేపట్టిన ఏడు నెలల్లోనే తమకు పనికి వచ్చేవారెవరో? అవసరం లేని వారెవరో? కూటమి పెద్దలు ఒక అంచనాకు వచ్చి ఈ బదిలీలు చేసినట్లు కనబడుతోంది. బాగా […]
2024లో తిరుమల హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయం రోజురోజుకీ పెరుగుతోంది. భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతుండడంతో హుండీ ఆదాయం కూడా అందుకు తగ్గట్టుగానే రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఆపద మొక్కులు తీర్చే వెంకన్న ఆస్తుల విలువ ప్రతి ఏడాది అమాంతం పెరుగుతోంది. 2024 సంవత్సరానికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపింది. మొత్తం 2.55 కోట్ల […]