Andhrabeats

ఏప్రిల్‌ మొదటివారంలో మెగా డీఎస్సీ : చంద్రబాబు

Cm Cbn anounces Mega Dsc in Ap

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాల కోసం ఎదురుచూస్తున్న లక్షల మంది అభ్యర్థులకు శుభవార్త! ఏప్రిల్‌ మొదటి వారంలో డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పగడ్బంధీగా మెగా డీఎస్సీ నిర్వహించాలని అధికారులకు సూచించారు. అమరావతి సచివాలయంలో మంగళవారం ప్రారంభమైన జిల్లా కలెక్టర్ల సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. 16,347 టీచర్‌ పోస్టులు భర్తీ చేయాలనే దస్త్రంపైనే అధికారాన్ని చేపట్టిన వెంటనే మొదటి సంతకం చేశానని తెలిపారు. పాఠశాలలు ప్రారంభించే సమయానికి […]

కూటమిలో సుడిగుండాలు తప్పవేమో!

ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. అలాటిది కూటమి ఒరలో మూడు కత్తులు –చంద్రబాబు; అయన కొడుకు లోకేష్; కూటమి కూర్పులో సూత్రధారి అయిన పవన్ కళ్యాణ్. ఇలా అయితే కలహాల కాపురం కాక మరేమవుద్ది. కూటమి విజయ పరంపర కు తానే కారణం అని పవన్ భావన. అది నిజం కూడా కావొచ్చేమో! బాబు మరోసారి అధికార పీఠం ఎక్కడానికి బీజేపీ తో సంధి కుదరడం కీలకంగా మారింది. అలాటి కూటమి రధచక్రానికి పవన్ ఇరుసు […]

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్

హైదరాబాద్ లో  ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ ను  పోలీసులు అరెస్టు చేశారు. ఆయనపై ఇప్పటికే చాలా కేసులు నమోదు అయిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా వల్లభనేని వంశీని అరెస్టు చేస్తారని ఇప్పటికే చాలా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా… హైదరాబాదులో ఉన్న వల్లభనేని వంశీని అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. ఇవాళ ఉదయం అరెస్టు చేసిన తర్వాత విజయవాడకు వల్లభనేని వంశీని తరలిస్తున్నారు. అయితే ఏ కేసులో వల్లభనేని వంశీని అరెస్టు […]

కమ్యూనిస్టు పార్టీల్లో అంతర్గత రాజకీయాలు ఎలా ఉంటాయో తెలుసా?

తెలంగాణా సి.పి.ఎం. కార్యదర్సి పదవి ఒక దళితుడికి దక్కింది. మార్క్సిస్ట్‌ పార్టీలో పెద్ద పదవి ఒక మాదిగోడికి దక్కడమా? ఆదర్శాల ఆకాశం విరిగి పడిపోయిందా, ఏమిటి? ఈ దేశంలో విప్లవం కమ్మవాళ్లూ, రెడ్లూ తేవాలి తప్ప, మధ్యలో ఈ ఎందుకూ కొరగాని మాలమాదిగలెవ్వరు? అసలేం జరుగుతోంది? పోనీ.. ఎందుకూ ఇలా జరిగింది? లేటుగా అయినా కామ్రేడ్స్‌ కి జ్ఞానోదయం అయింది అనుకోవాలా? ఇది మార్క్సిస్ట్‌పార్టీ మన మీద వేసిన క్రూయల్‌ జోకు కాదు కదా! అసలు ఎవరీ […]

టీడీపీ మంత్రి పక్కన వైసీపీ మాజీ మంత్రి.. తెలుగు తమ్ముళ్ల రచ్చ రచ్చ

నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా పెద్దఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. అందులో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంతో తెలుగు తమ్ముళ్లు నానా రచ్చ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పక్కన జోగి రమేష్ ఉండడాన్ని టీడీపీ శ్రేణులు […]

నాగబాబుకు మంత్రి పదవి

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ ఎట్టకేలకు తన సోదరుడు నాగబాబుకి రాజకీయంగా ప్రాధాన్యం కల్పించగలిగారు. త్వరలో ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన్ను మంత్రి ఎన్డీయే కూటమి తరఫున మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత చట్టసభలో కొనసాగేందుకు వీలుగా ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వనున్నారు. ముగ్గురు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇప్పించాలని పవన్‌ కళ్యాణ్‌ భావించారు. అయితే మూడింటిలో రెండు […]

వైఎస్‌ జగన్‌ పరువు నష్టం దావా కేసు- ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్‌ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారంటూ ఆ రెండు పత్రికలపై వైఎస్‌ జగన్‌ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అదానీ గ్రూప్‌ అవినీతి కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు […]

పవన్‌ను షిప్‌ ఎక్కనివ్వొద్దని చంద్రబాబు చెప్పారేమో?

పవన్‌ కల్యాణ్‌ తన శాఖ కాకపోయినా కూడా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లినందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అనుభవమున్న రంగం కాబట్టి షిప్‌ చుట్టూ గిరగిరా తిరుగుతూ  వీడియోలు తీశారని, మంచి ప్రయత్నమే కానీ పవన్‌ పర్యటనపై అంతా అనుమానంగానే ఉందని అన్నారు. పోర్టు ఆఫీసర్, కస్టమ్స్‌ ఆఫీసర్‌ పవన్‌తో బోటులోనే ఉన్నారని తెలిపారు. వాళ్లిద్దరూ షిప్‌లోనే ఉండి పవన్‌కు పర్మిషన్‌ ఎందుకు […]

ఆ పత్రికలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నా : మాజీ సీఎం జగన్

అదానీ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ బీఐ ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని జగన్ అన్నారు. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదని ఆయన స్పష్టం చేశారు. నాకు లంచం ఆఫర్ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తన పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేవారిపై […]