6 లైన్లుగా కోస్తా జాతీయ రహదారి–216
కోస్తా జాతీయ రహదారి – 216ని విస్తరించేందుకు కేంద్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకూ రహదారి ఉండగా రెండు దశల్లో విస్తరించాలని యోచిస్తున్నారు. తొలి దశలో కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం వరకు 229 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న రహదారిని ఆరు లైన్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేయాలని భావిస్తున్నారు. కాకినాడ పోర్టు ఇప్పటికే అభివృద్ధి చెందగా, […]
ఏపీలో ఈ 18 రోడ్లపై టోల్ టాక్స్
ఆంధ్రప్రదేశ్ అప్పుల కుప్పగా మారిందని చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం రోడ్లను బాగు చేసేందుకు జనాన్నే నమ్ముకుంది. వారు తిరిగే రోడ్లపై వారి నుంచే డబ్బులు వసూలు చేసి రిపేర్లు చేయించనుంది. ప్రస్తుతం జాతీయ రహదారుల తరహాలోనే రాష్ట్ర రహదారుల్ని కూడా దశల వారీగా పీపీపీ విధానంలో అభివృద్ధి చేసి వాటిపై టోల్ గేట్లు పెట్టేందుకు సిద్దమవుతోంది. తొలి దశలో 18, రెండో దశలో 68 రోడ్లు అభివృద్ధి చేసి టోల్ వసూలు చేయనున్నారు. జాతీయ రహదారుల తరహాలోనే […]