Andhrabeats

జేసీ ప్రభాకర్, ఆదినారాయణరెడ్డిలకు చంద్రబాబు పిలుపు

బూడిద తరలింపుపై ఎన్డీఏ కూటమిలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు చంద్రబాబు నడుం బిగించారు. వైఎస్సార్‌ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపుపై టిడిపికి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బిజెపికి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని సమాచారం అందింది. ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం కలవాలంటూ ఆదేశాలు వచ్చాయి. సిమెంటు పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో జేసీ, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. […]