ఐదు అంతస్తుల వరకు అనుమతులు అవసరం లేదు: మంత్రి నారాయణ
పట్టణ ప్రాంతాల్లో ఐదు అంతస్తుల వరకు భవన నిర్మాణాలకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. లేఅవుట్, భవనాలకు సంబంధించి మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తే అనుమతులు వస్తాయని చెప్పారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసి అనుమతులు పొందవచ్చని తెలిపారు. ఇతర శాఖల అనుమతులు అవసరం లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని పట్టణాల్లో రోడ్లు, వీధి దీపాలు, తాగునీరు, వరదనీరు, ఘన వ్యర్థాల నిర్వహణ తదితర అంశాలపై 15 రోజుల్లో డీపీఆర్ రూపొందించాలని […]