ఓ పుట్టినరోజు… ఓ నాయకత్వ గాథ!

2025 ఏప్రిల్ 20న, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో అగ్రగామిగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా, ఆయన రాజకీయ జీవితం విజయాలు, సవాళ్లు, వివాదాలు, కుటుంబ బంధాలు, అసాధారణ వ్యూహాలతో నిండిన ఒక సినిమాటిక్ కథలా సాగింది. రాజకీయ సామ్రాజ్యంలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం కేవలం రాజకీయ అవకాశం కాదు. అది ఆయన రాజకీయ తెలివి, […]
పేదలను ఆదుకునే మిషన్ పీ-4 : చంద్రబాబు

ఆదుకునే మిషన్ పీ4 అని, సమాజంలో ఈ కార్యక్రమం గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పీ4 ఒక మహత్తర కార్యక్రమం అని, చరిత్ర సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అమరావతి రాజధానిలో ఆదివారం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లోగోను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాసేవకే నా జీవితం అంకితం తెలుగువారి తొలి పండుగ ఉగాది రోజున ఏ కార్యక్రమం […]
20 లక్షల కుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలి : చంద్రబాబు

రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ – పీ4 విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ4లో భాగస్వాములు కావొచ్చని.. గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే పీ4 కార్యక్రమానికి […]
నాకు ప్రజలే హైకమాండ్ : చంద్రబాబు

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని, పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి, జనాన్ని బలవంతంగా తరలించేవారని, తాను అలాంటి సీఎం కాదని, సాదాసీదాగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులు చూసుకోవడమే తన బాధ్యత అని అన్నారు. తనకు హైకమాండ్ అంటూ ఏం లేదని, 5 కోట్ల ప్రజలే తనకు హైకమాండ్ అని […]
ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు

ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు. […]
విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు

బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. క్లాస్ రూమ్‌లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కష్టపడి చదువుకోవాలని, చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. బాపట్ల మున్సిపల్ స్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నిరంతరం నేర్చుకోవడం […]
నా పాలన ఎలా ఉందో చెప్పండి : చంద్రబాబు

తన పాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎపీ సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS (Interactive Voice Response System) ఫోన్లు చేసి అమలు తీరును తెలుసుకుంటామని ప్రకటించారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల […]