Andhrabeats

ధనవంతులు పేదలను ఆదుకోండి : ప్రజలకు చంద్రబాబు లేఖ

    ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ఆయన ప్రజలకు లేఖ రాశారు. ‘పది సూత్రాలతో స్వర్ణాంధ్ర –2047 విజన్‌ ను ఆవిష్కరించాం. ఇందులోని పది సూత్రాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్‌ 1 చేసేందుకు అడుగులు వేస్తున్నాం. వీటిలో ప్రధమ సూత్రం జీరో పావర్టీ. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు […]

భక్తుల మృతి కలిచివేసింది: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు : చంద్రబాబు

‘పవిత్ర దివ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన బాధాకరమైన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. భక్తుల మరణ వార్త విని ఎంతో బాధపడ్డా. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నా. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒక వెంకటేశ్వరస్వామి భక్తుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాపై ఉంది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నా.’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం జరిగిన తోపులాటలో […]

ధాన్యం మిల్లుకు చేరిన వెంటనే రైతుల అకౌంట్లో డబ్బులు

  ధాన్యం సేకరణలో ఎక్కడా తప్పు జరగడానికి వీల్లేదు, తేమశాతంలో కచ్చితత్వం ఉండాలని సీఎం చంద్రబాబు అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే అకౌంట్లో డబ్బులు జమ అవుతున్నాయని అన్నారు. వ్యవసాయంలో యాంత్రీకరణ పెరిగితే రైతులకు శ్రమ తగ్గడంతో పాటు ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు. పెట్టుబడి తగ్గించి రైతులను ఆప్పుల ఊబి నుండి బయటకు తీసుకొచ్చి ఉపశమనం కలిగించడంతో పాటు ఆదాయం పెంచాలన్నదే తమ సంకల్పమన్నారు. […]

జమిలి వచ్చినా ఎన్నికలు 2029లోనే

ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో ముందుకు వెళుతూ జమిలి ఎన్నికల విధానాన్ని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం వడివడిగా అడుగులు వేస్తున్న వేళ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికల విధానం అమల్లోకి వచ్చినా రాష్ట్రంలో మాత్రం 2029లోనే ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. అంటే వచ్చే సాధారణ ఎన్నికల నుంచి జమిలి అమలవుతుందని ఆయన అభిప్రాయంగా ఉంది. నిజానికి జమిలి వస్తే ఎన్నికలు రెండేళ్ల ముందుకు జరుతాయని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది. 2027 చివర్లో […]

తల్లితండ్రులు చనిపోయిన పిల్లలకు పింఛన్‌

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారులకు పింఛను అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. గురువరం కలెక్టర్ల కాన్ఫరెన్సులో ఈ విషయాన్ని ప్రకటించి అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 3 నెలల్లో రాష్ట్రంలో తల్లిదండ్రులు చనిపోయిన చిన్నారుల వివరాలను సేకరించాలని, వారికి వెంటనే పింఛన్‌లు అందించే దిశగా చర్యలు చేపట్టాలని సమావేశంలో కలెక్టర్లకు సీఎం చంద్రబాబు సూచనలు చేశారు. ప్రతి ఏటా ఈ జాబితాను సిద్దం చేసి అప్‌డేట్‌ చేయాలన్నారు. […]

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు

బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. క్లాస్‌ రూమ్‌లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కష్టపడి చదువుకోవాలని, చదువుకుంటేనే మంచి భవిష్యత్‌ ఉంటుందని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌ కూడా ఉన్నారు. బాపట్ల మున్సిపల్‌ స్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్‌–టీచర్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నిరంతరం నేర్చుకోవడం […]

అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు

Chandrababu plot in Amaravati

నవ్యాంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రెండవసారి పనిచేస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆయన ఏపీలో సొంతిల్లు సమకూర్చుకోలేదు. అమరావతిలోని ఉండవల్లి కరకట్టపై పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కి చెందిన అతిథి గృహాన్ని తన నివాసంగా మార్చుకుని ఏడేళ్లుగా అక్కడే ఉంటున్నారు. దీనిపై చాలా విమర్శలు, వివాదాలు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏపీలో ఇల్లు కట్టుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలో సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. రాజధానిలోని వివిధ […]

చంద్రబాబుతో పవన్ ప్రత్యేక సమావేశం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక భేటీపై ఆసక్తి నెలకొంది. సోమవారం ఉండవల్లి నివాసంలో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ లంచ్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. తాజా రాజకీయ పరిణామాలు, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నట్లు టిడిపి వర్గాలు తెలిపాయి. తన డిల్లీ పర్యటన విశేషాలను చంద్రబాబుకు పవన్ చెప్పినట్లు సమాచారం. వీటితో పాటు సోషల్ మీడియా కేసులు, నామినేటెడ్ పదవులపై కూడా ఇరువురి మధ్య జరిగినట్లు తెలిసింది ఇటీవల పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి […]

నా పాలన ఎలా ఉందో చెప్పండి : చంద్రబాబు

తన పాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎపీ సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS (Interactive Voice Response System) ఫోన్లు చేసి అమలు తీరును తెలుసుకుంటామని ప్రకటించారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల […]