Andhrabeats

ధనవంతులు పేదలను ఆదుకోండి : ప్రజలకు చంద్రబాబు లేఖ

    ఆర్థిక అసమానతలు తగ్గించి సమాజంలో ప్రతి ఒక్కరి జీవన ప్రమాణాలు పెరిగినప్పుడే అందరి ఇళ్లలో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని తాను మనస్ఫూర్తిగా నమ్ముతున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. సంక్రాంతి సందర్భంగా ఆయన ప్రజలకు లేఖ రాశారు. ‘పది సూత్రాలతో స్వర్ణాంధ్ర –2047 విజన్‌ ను ఆవిష్కరించాం. ఇందులోని పది సూత్రాల ద్వారా తెలుగు జాతిని ప్రపంచంలో నెంబర్‌ 1 చేసేందుకు అడుగులు వేస్తున్నాం. వీటిలో ప్రధమ సూత్రం జీరో పావర్టీ. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు […]

భక్తుల మృతి కలిచివేసింది: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు : చంద్రబాబు

‘పవిత్ర దివ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన బాధాకరమైన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. భక్తుల మరణ వార్త విని ఎంతో బాధపడ్డా. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నా. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒక వెంకటేశ్వరస్వామి భక్తుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాపై ఉంది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నా.’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం జరిగిన తోపులాటలో […]

విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు

బాపట్ల మున్సిపల్‌ హైస్కూల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. క్లాస్‌ రూమ్‌లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కష్టపడి చదువుకోవాలని, చదువుకుంటేనే మంచి భవిష్యత్‌ ఉంటుందని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్‌ కూడా ఉన్నారు. బాపట్ల మున్సిపల్‌ స్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్‌–టీచర్స్‌ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నిరంతరం నేర్చుకోవడం […]