భార్యను చంపి.. పశ్చాత్తాపంతో ఆమె సమాధి వద్ద బలవన్మరణం
భార్యతో గొడవపడ్డ ఓ భర్త క్షణికావేశంలో కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలతో భార్య చనిపోయింది. దీంతో జైలుపాలైన భర్త ఆరు నెలల తర్వాత బెయిల్ పై బయటకు వచ్చి భార్య సమాధి వద్దే ఉరి వేసుకుని చనిపోయాడు. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలో ఆదివారం జరిగిందీ ఘటన. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామకుప్పం మండలం బైపరెడ్లపల్లికి చెందిన గంగిరెడ్డి, సుజాత దంపతులు బెంగళూరుకు వలస వెళ్లారు. కూరగాయల వ్యాపారం చేసుకుంటూ […]