పార్సిల్‌లో డెడ్ బాడీ.. షాక్ తిన్న మహిళ

పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలంలో డెడ్‌బాడీ కలకలం రేపింది. ఆ డెడ్‌బాడి పార్శిల్‌లో రావడంతో అంతా భయపడిపోయారు. ఉండి మండలం యండగండిలో తులసి అనే మహిళకు ఓ పార్శిల్ వచ్చింది. అందులో ఎలక్ట్రిక్ పరికరాలు ఉన్నాయంటూ పార్శిల్ తెచ్చిన వ్యక్తి చెప్పి.. ఇచ్చి వెళ్లిపోయాడు. కాసేపు ఆగిన తర్వాత పార్శిల్ ఓపెన్ చేసిన తులసి కాళ్లు చేతులు వణికిపోయాయి. పార్శిల్‌లో కుళ్లిన డెడ్‌బాడీని చూసిన తులసికి ఏం చేయాలో అర్థం కాలేదు. అందర్నీ పిలిచి చూపించింది. […]
ప్రేమించలేదని బాలికను సజీవ దహనం చేసిన బాలుడు

ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో బాలికపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. బాలుడికి కూడా మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన బాలిక, కలుగొట్లకు చెందిన బాలుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. బాలుడు కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం బాలిక తన పేరెంట్స్‌కు చెప్పింది. దాంతో వారు బాలికను ఆమె అమ్మమ్మ ఉండే […]
ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసిన భార్య

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది ఒక భార్య. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సోలిశెట్టిపల్లిలో ఈ దారుణం జరిగింది. గోవిందప్ప(38)కు 15 ఏళ్ల కిందట గుడుపల్లి మండలం పెద్దవంకకు చెందిన మీనాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 4 నుంచి భర్త కనిపించడం లేదంటూ 5వ తేదీన మీనా రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. […]
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యులు మృతి

అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు కాగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దట్టమైన మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్ గుర్తించారు. వీరంతా హాంకాంగ్ విహారయాత్రకు […]