Andhrabeats

తీరం దాటినా వణికిస్తున్న ఫెంగల్ తుఫాను

పుదుచ్చేరి సమీపంలో తీరం దాటిన ఫెంగల్ తుఫాన్ ఇంకా తన ప్రతాపం చూపిస్తూనే ఉంది. ఆదివారం సాయంత్రానికి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి వద్ద కొనసాగుతోంది. మాములుగా అయితే తీరం దాటిన 2, 3 గంటల్లో ఏ తుఫాను అయినా బలహీనపడుతుంది. కానీ ఫెంగల్ తుఫాను తీరం దాటి 5, 6 గంటలైనా బలహీనపడకుండా స్థిరంగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ దిశగా నెమ్మదిగా కదులుతూ  రానున్న కొద్ది గంటలలో బలహీనపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం […]

తుఫాను కాదు.. తీవ్రవాయుగుండమే.. చెన్నైలో భారీ వర్షాలు

ఏపీకి తుఫాను ముప్పు లేదని వాతావరణ అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని తీవ్ర వాయుగుండం తుఫానుగా రూపాంతరం చెందలేదని, ఇది ఈ సాయంత్రం వరకు వాయుగుండంగా బలహీనపడుతుందన్నారు. శనివారం ఉదయానికి కారైకాల్, మహాబలిపురం మధ్యలో తీరం దాటవచ్చని చెప్పారు. తుఫాన్ ముప్పు లేకున్నా వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. తమిళనాడులో భారీ వర్షాలు దీని ప్రభావంతో తమిళనాడులోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. […]