రూ.337 లక్షల కోట్లు.. భారత ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ

బంగారం అంటే భారతీయుల ప్రాణం! సంపద, శుభం, గౌరవం – ఈ మూడు ఒక్క మాటతో చెప్పాలంటే “పసిడి” అనే చెప్పాలి. వందల ఏళ్లుగా బంగారం భారతీయుల జీవనంలో అంతర్భాగమై ఉంది. పండుగలు, పెళ్లిళ్లు, శుభకార్యాలు అన్నింటికీ బంగారం లేకపోతే ‘పూర్తి’ అనిపించదు. కానీ, ఇప్పుడు బంగారం కేవలం ఆభరణం మాత్రమే కాదు – ఒక ఆర్థిక భద్రతా సాధనం, పెట్టుబడి రూపంగా మారిపోయింది. అత్యవసర పరిస్థితుల్లో సులభంగా నగదుగా మార్చుకునే ఆస్తిగా ప్రజలు దీన్ని భావిస్తున్నారు. […]