Andhrabeats

వైసీపీకి ఇద్దరు కీలక నేతలు గుడ్‌బై

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఒకేరోజు ఇద్దరు ముఖ్య నాయకులు రాజీనామా చేశారు. విశాఖపట్నానికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్, భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌లు జగన్‌ను వీడారు. విశాఖలో గురువారం అవంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీని వీడుతున్నట్లు తెలిపారు. జగన్‌ నిర్ణయాలను ఆయన తప్పు పట్టడం గమనార్హం. ఎన్నికల్లో గెలుపోటములు సహజమని, ప్రజాతీర్పును గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కొత్త ఏర్పడిన ప్రభుత్వానికి సంవత్సరం సమయం ఇవ్వాలని, అలాకాకుండానే ఆర్నెళ్లు కాకముందే […]