ఏపీకి కర్నాటక పనికిరాని ఏనుగులు ఎందుకిచ్చింది?

కర్నాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన నాలుగు కుంకీ ఏనుగులు పనికిరానివని తేలింది. వాటిని భరించలేక, మేపలేక అక్కడి ప్రభుత్వం ఆ ఏనుగుల్ని ఏపీకి అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద ఘనతగా ప్రచారం చేసుకుని ఇప్పుడు కిక్కురుమనడంలేదు. తీసుకువచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా నిర్వహించలేదు. దీన్నిబట్టే వాటి సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతోంది. తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు, ఒడిస్సా సరిహద్దులో ఉన్న […]