Andhrabeats

లండన్‌లో కాపురం పెట్టనున్న కోహ్లి

టీం ఇండియా క్రికెట్‌ స్టార్‌ విరాట్‌ కోహ్లి లండన్‌లో సెటిల్‌ అవుతాడనే వార్తలు గత కొంతకాలంగా వైరల్‌ అవుతున్నాయి. తరచూ కోహ్లి లండన్‌లో ఉండడమే దీనికి కారణం. కోహ్లి లండన్‌లో సెటిల్‌ అవుతాడా లేదా అనే సస్పెన్స్‌కు అతని చిన్ననాటి కోచ్‌ రాజ్‌ కుమార్‌ శర్మ సస్పెన్స్‌కు తెరదించాడు. కోహ్లి అతని భార్య అనుష్క శర్మ, పిల్లలు వామికా, అకాయ్‌ లతో కలిసి లండన్‌కు షిఫ్ట్‌ అవబోతున్నాడని రాజ్‌ కుమార్‌ శర్మ తెలిపాడు.