ప్రేమించలేదని బాలికను సజీవ దహనం చేసిన బాలుడు
ఏపీలోని నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రేమించలేదనే కారణంతో బాలికపై బాలుడు పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలిక మృతి చెందింది. బాలుడికి కూడా మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. వెల్దుర్తి మండలం సామర్లకోటకు చెందిన బాలిక, కలుగొట్లకు చెందిన బాలుడు ఇంటర్మీడియట్ చదువుతున్నారు. బాలుడు కొంతకాలంగా బాలికను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. ఈ విషయం బాలిక తన పేరెంట్స్‌కు చెప్పింది. దాంతో వారు బాలికను ఆమె అమ్మమ్మ ఉండే […]