నాగబాబుకు మంత్రి పదవి
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు తన సోదరుడు నాగబాబుకి రాజకీయంగా ప్రాధాన్యం కల్పించగలిగారు. త్వరలో ఆయన రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన్ను మంత్రి ఎన్డీయే కూటమి తరఫున మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత చట్టసభలో కొనసాగేందుకు వీలుగా ఆయనకు ఎమ్మెల్సీ స్థానం ఇవ్వనున్నారు. ముగ్గురు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ అభ్యర్థులు రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానాల్లో ఒకటి నాగబాబుకు ఇప్పించాలని పవన్ కళ్యాణ్ భావించారు. అయితే మూడింటిలో రెండు […]