జనవరి 1 నుంచి ఏపీకి కొత్త సీఎస్, డీజీపీ
రాష్ట్రానికి త్వరలో కొత్త సీఎస్ (ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి), డీజీపీ నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీఎస్‌గా పనిచేస్తున్న నీరబ్‌కుమార్ ప్రసాద్, డీజీపీ ద్వారకా తిరుమలరావులు ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. నీరబ్‌కుమార్ మూడు నెలల క్రితమే రిటైర్ అయినా చంద్రబాబు కేంద్ర అనుమతితో మరో మూడు నెలలు పొడిగించారు. ఈ నెలాఖరుతో ఆ గడువు ముగియనుంది. మరోసారి ఆయన సర్వీసు పొడిగించేందుకు ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. దీంతో ఈ నెలాఖరుకల్లా కొత్త సీఎస్‌ను ఖరారు చేయాల్సివుంది. […]