గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీగా గోపి మూర్తి గెలుపు
ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పీడీఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి గెలుపొందారు. 9,165 ఓట్లు సాధించి మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే గెలుపొందడం విశేషం. ప్రత్యర్థి గంధం నారాయణరావుకి సుమారు 5,259 ఓట్లు పడ్డాయి. సోమవారం కాకినాడ జేఎన్టీయూ డా.బీఆర్.అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో ఓట్ల లెక్కింపు జరిగింది. కౌంటింగ్ ఏజెంట్ల సమక్షంలో 14 టేబుల్స్ పై 76 మంది సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు. ఆరు జిల్లాల్లో 116 కేంద్రాల్లో 92.62 శాతం […]