Andhrabeats

వైసీపీ నేత పేర్ని నానికి షాక్‌

వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్‌ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. నాని నిర్వహిస్తున్న గోడౌన్‌లో రేషన్‌ బియ్యం గల్లంతు కావడంపై కేసు నమోదయింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గోడౌన్‌లో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్‌జీర్‌ జిలానీ ఆదేశించారు. బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాని రూ.1.80 కోట్లు […]

పవన్‌ను షిప్‌ ఎక్కనివ్వొద్దని చంద్రబాబు చెప్పారేమో?

పవన్‌ కల్యాణ్‌ తన శాఖ కాకపోయినా కూడా ప్రాణాలకు తెగించి సముద్రంలోకి వెళ్లినందుకు ఆయనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. మచిలీపట్నంలో పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. అనుభవమున్న రంగం కాబట్టి షిప్‌ చుట్టూ గిరగిరా తిరుగుతూ  వీడియోలు తీశారని, మంచి ప్రయత్నమే కానీ పవన్‌ పర్యటనపై అంతా అనుమానంగానే ఉందని అన్నారు. పోర్టు ఆఫీసర్, కస్టమ్స్‌ ఆఫీసర్‌ పవన్‌తో బోటులోనే ఉన్నారని తెలిపారు. వాళ్లిద్దరూ షిప్‌లోనే ఉండి పవన్‌కు పర్మిషన్‌ ఎందుకు […]