వసూళ్లలో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బద్దలు కొట్టిన పుష్ప2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2– ది రూల్ చిత్రం కలెక్టన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలిరోజు వసూళ్లలో ఎన్టీఆర్, రామ్చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పేరుతో ఉన్న రికార్డును తుడిచిపెట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు సంచలనాలు సృష్టించగా ఇప్పుడు విడుదలయ్యాక మోత కలెక్షన్లలోనూ భారతీయ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.294 కోట్లు వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ […]