Andhrabeats

రాజమండ్రి రైల్‌ బ్రిడ్జికి 50 వసంతాలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రఖ్యాతిగాంచిన రాజమండ్రి రోడ్డు కమ్‌ రైల్వే బ్రిడ్జి 50 వసంతాలను పూర్తి చేసుకుంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండవ రోడ్డు–రైల్వే బ్రిడ్జిగా చరిత్రలో ఇది నిలిచింది. 1974 సంవత్సరంలో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తోంది. ప్రస్తుతం దీనిపై వాహనాల రాకపోకలను నిషేధించారు. భారతదేశంలోని ప్రాచీన వంతెనల్లో ఇది ఒకటి.