క్యాన్సర్‌కు వ్యాక్సిన్ కనుగొన్న రష్యా
ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధికి త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. క్యాన్సర్‌కు టీకా అభివృద్ధి చేసినట్టు రష్యా బుధవారం చేసిన ప్రకటన క్యాన్సర్ చికిత్సలో విప్లవాత్మకంగా మారే అవకాశం ఉంది. తమ దేశంలోని పలు పరిశోధన సంస్థలు కలిసి క్యాన్సర్‌ను ఎదుర్కొనే ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ను తయారుచేసినట్టు రష్యా న్యూస్ ఏజెన్సీ టీఏఎస్‌ఎస్ వెల్లడించింది. వచ్చే ఏడాది నుంచి క్యాన్సర్ బాధితులకు ఉచితంగా ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్టు రష్యా ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పని చేసే రేడియాలజీ మెడికల్ రీసెర్చ్ […]