Andhrabeats

నూతన సంవత్సరం తొలిరోజున 2 వేల మందిని కలిసిన చంద్రబాబు

  నూతన సంవత్సర తొలిరోజున దాదాపు 2 వేల మందిని కలిసిన సిఎం చంద్రబాబు 1,600 మంది పేదలకు రూ.24 కోట్లు విడుదల చేసే సిఎంఆర్ఎఫ్ ఫైల్ పై సంతకంతో నూతన సంవత్సరం మొదటి రోజు తన ప్రారంభించిన సిఎం చంద్రబాబు. @10.45am – టీటీడీ అర్చకులతో ఆశీర్వాదం తీసుకున్న సీఎం చంద్రబాబు. @11 am- ఉదయం ఇంట్లో ఐఎఎస్,ఐపిఎస్ అధికారులు, వివిధ శాఖల అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు సమయం ఇచ్చిన సిఎం. @12.20- తరువాత దుర్గగుడిలో […]

నాకు ప్రజలే హైకమాండ్‌ : చంద్రబాబు 

Ap Cm Chandrababu in Pension Distribution Programme

పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే నిజమైన సంక్షేమమని, పేదరికం లేని సమాజమే తన లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నారంటే చెట్లు కొట్టేసి, పరదాలు కట్టి, జనాన్ని బలవంతంగా తరలించేవారని, తాను అలాంటి సీఎం కాదని, సాదాసీదాగా నిత్యం ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులు చూసుకోవడమే తన బాధ్యత అని అన్నారు. తనకు హైకమాండ్‌ అంటూ ఏం లేదని, 5 కోట్ల ప్రజలే తనకు హైకమాండ్‌ అని […]

టీడీపీ మంత్రి పక్కన వైసీపీ మాజీ మంత్రి.. తెలుగు తమ్ముళ్ల రచ్చ రచ్చ

నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా పెద్దఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. అందులో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంతో తెలుగు తమ్ముళ్లు నానా రచ్చ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పక్కన జోగి రమేష్ ఉండడాన్ని టీడీపీ శ్రేణులు […]

యనమలది తిరుగుబాటేనా ?

యనమల లేఖాస్త్రం టీడీపీని కలవరపెడుతోంది. కాకినాడ సెజ్‌ పేరుతొ బీసీ (మత్స్యకారుల)ల సాగులో వున్న వేలాది ఎకరాల భూములను ప్రభుత్వం లాక్కొని ‘కమ్మ‘ పారిశ్రామిక వేత్తలకు దారాదత్తం చేసిందని యనమల ఆరోపించారు. కమ్మలు అంటే బాబు సామాజికవర్గమని వేరే చెప్పక్కర్లేదు. దీనర్థం చంద్రబాబుపైన ఉరుములు లేకుండా మెరుపుదాడి చేయడమే. నిజానికి గత కాంగ్రెస్‌ (వైఎస్సార్‌) హయాంలోనే సెజ్‌ కోసం భూసేకరణ జరిగింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలు కూడా గడవకముందే యనమల తమ ప్రభుత్వాన్నే బీసీ […]

నా పాలన ఎలా ఉందో చెప్పండి : చంద్రబాబు

తన పాలన ఎలా ఉందో తెలుసుకునేందుకు ఎపీ సీఎం చంద్రబాబు ప్రజల అభిప్రాయాలు సేకరించనున్నారు. ఇకపై ప్రభుత్వం అమలు చేసే పథకాలపై IVRS (Interactive Voice Response System) ఫోన్లు చేసి అమలు తీరును తెలుసుకుంటామని ప్రకటించారు. లబ్ధిదారులకే నేరుగా కంప్యూటర్ బేస్డ్ ఫోన్ కాల్స్ ద్వారా ఆ పథకం వల్ల ప్రయోజనం, దాని అమలు, సేవల్లో నాణ్యత వంటి అంశాలపై ప్రజల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనుంది. ఈ క్రమంలో లబ్ధిదారుల నుంచి ఆయా పథకాల […]