బాలయ్య స్టైల్ రగడ– చిరు క్లాస్ కౌంటర్

హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవిపై, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ, రాజకీయ వర్గాల్లో హీట్ పుట్టించాయి. బాలయ్య కెలికిన రచ్చకు చిరంజీవి లేఖ రూపంలో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో, ఈ ఇష్యూ సోషల్ మీడియా నుంచి సామాన్యుల చర్చల వరకూ వైరల్ అయ్యింది. అసెంబ్లీలో బాలయ్య ఫైర్: “ఎవడు గట్టిగా అడిగాడు?” శాసనసభలో శాంతిభద్రతల అంశంపై చర్చ జరుగుతుండగా, బీజేపీ సభ్యుడు కామినేని శ్రీనివాస్, జగన్ […]
చిట్టగాంగ్‌ను చేరిస్తే బంగళాఖాతం వరకూ ఈశాన్య భారతమే

ఎంతటి బలవంతుడికైనా ఓ బలహీనత ఉంటుంది… ఆ బలహీనతను శత్రువు గుర్తిస్తే పెను ప్రమాదం పొంచి ఉన్నట్టే… తన బలహీనతను శత్రువు గుర్తించాడని తెలిసి కూడా సరిదిద్దుకోకపోతే స్వయంకృతాపరాధమే.ఈ సూత్రం దేశ రక్షణ వ్యవహారాలకు మరింత ఎక్కువగా వర్తిస్తుంది. అందుకు భారతదేశం కూడా మినహాయింపు కాదు. మరి వ్యూహాత్మకంగా భారత్ బలహీనత ఏమిటీ…!? చికెన్ నెక్ ప్రాంతం. తెలుగులో చెప్పాలంటే కోడిమెడ ప్రాంతం. సెవెన్ సిస్టర్స్ గా పిలిచే ఏడు రాష్ట్రాలను మిగిలిన భారత దేశంతో […]
ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ : గంటా నిర్వేదం

టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం నుంచి అమరావతి వెళ్లడానికి పడే ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ నిర్వేదం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ’ అంటూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో […]
సీనియర్ ఐఏఎస్ సిసోడియాపై వేటు

సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియాకు కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు ఆశిస్తున్న ఆయనకు ఉన్న కీలకమైన పోస్టును కూడా పీకేసింది. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించారు. గత ప్రభుత్వంలో జరిగిన భూముల వ్యవహారాలకు సంబంధించిన అవకతవకలను బయటపెట్టడానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. చంద్రబాబు ఆశించిన విధంగా పని చేసిన ఆయన ఒక దశలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన […]
10 నెలల తర్వాత ముత్యాలరాజుకి పోస్టింగ్

వైఎస్ జగన్ ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసిన నలుగురు ఐఏఎస్ అధికారులకు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. 10 నెలలపాటు వారిని వెయిటింగ్‌లో ఉంచి ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం లేని పోస్టుల్లో నియమించింది. రేవు ముత్యాలరాజు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు కార్యదర్శిగా పనిచేశారు. జగన్‌కు అత్యంత సన్నిహితంగా పనిచేయడంతో ఆయన వైసీపీ ముద్ర వేశారు. ఆ కారణంగానే పోస్టింగ్ ఇవ్వలేదు. దాదాపు 10 నెలలపాటు ఆయన్ను జీఏడీలోనే ఖాళీగా ఉంచింది. అయితే ఆయన […]
ఎంపీల వేతనాల పెంపు: కేంద్రం కీలక నిర్ణయం

మన పార్లమెంటు సభ్యులకు శుభవార్త. కేంద్ర ప్రభుత్వం ఎంపీల వేతనాలు, అలవెన్సులు, పెన్షన్లలో 24% పెంపును ప్రకటించింది. ఈ నిర్ణయం 2023 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చినప్పటికీ, తాజాగా దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ మార్చి 24, 2025న విడుదలైంది. ఈ పెంపుతో ఎంపీల నెలవారీ వేతనం రూ.1 లక్ష నుంచి రూ.1.24 లక్షలకు చేరుకుంది. వేతనాలతో పాటు అలవెన్సుల్లోనూ మార్పు ఈ సవరణలో భాగంగా, ఎంపీలకు రోజువారీ భత్యం రూ.2,000 నుంచి రూ.2,500కు పెంచారు. […]
ధార్’ గ్యాంగ్.. దొంగతనాలే వారి ప్రవృత్తి

ధార్ గ్యాంగ్.. దొంగతనాల్లో ఈ గ్యాంగ్ స్టైలే వేరు. ఎక్కడి నుంచో వచ్చి రాష్ట్ర సరిహద్దుల్లో దజ్జాగా దోపిడీలు చేసి వెళ్ళిపోతారు. ఇటీవల అనంతపురంలో జరిగిన భారీ దోపిడీ ఈ గ్యాంగ్ పనే అని తేలింది. అనంతపురం నగర శివారు శ్రీనగర్ కాలనీలో కొన్ని రోజుల కిందట జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు ఛేదించారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ ప్రాంతానికి చెందిన ముగ్గురు దొంగలను అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.90 లక్షల విలువైన బంగారు, వజ్రాభరణాలు, […]
2024లో తిరుమల హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి ఆదాయం రోజురోజుకీ పెరుగుతోంది. భక్తుల రద్దీ అంతకంతకూ పెరిగిపోతుండడంతో హుండీ ఆదాయం కూడా అందుకు తగ్గట్టుగానే రికార్డు స్థాయిలో పెరుగుతోంది. దీంతో ఆపద మొక్కులు తీర్చే వెంకన్న ఆస్తుల విలువ ప్రతి ఏడాది అమాంతం పెరుగుతోంది. 2024 సంవత్సరానికి సంబంధించి తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం, ఇతర వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 2024లో శ్రీవారికి హుండీ ద్వారా రూ.1,365 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిపింది. మొత్తం 2.55 కోట్ల […]