ఈ ఆడ పులి 3 రాష్ట్రాలను హడలెత్తించింది

దట్టమైన అటవీ ప్రాంతం నుంచి తప్పించుకున్న ఒక ఆడ పులి మూడు రాష్ట్రాలను ముప్పతిప్పులు పెట్టింది. దాని శరీరానికి అమర్చిన రేడియో కాలర్ ద్వారా అది ఎక్కడికెక్కడికి వెళుతుందో తెలుసుకుంటూ అనేక చోట్ల ఉచ్చులు వేసినా ఎక్కడా చిక్కకుండా తప్పించుకుని తిరిగింది. 21 రోజులపాటు ఒడిస్సా, ఝార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అటవీ ప్రాంతాల్లోని 300 కిలోమీటర్ల మేర అది ప్రయాణించింది. మధ్యలో కొన్నిసార్లు జనావాసాలకు దగ్గరగా రావడంతో ఆయా ప్రాంతాల ప్రజలు వణికిపోయారు. మూడు రాష్ట్రాల […]