తిరుపతిలో తప్పు జరిగింది… క్షమించండి : పవన్ కల్యాణ్
![](https://www.andhrabeats.com/wp-content/uploads/2025/01/IMG-20250109-WA0469-1024x682.jpg)
వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటనకు ప్రభుత్వం తరఫున క్షమాపణలు చెబుతున్నట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తెలిపారు. తప్పు జరిగింది. బాధ్యత తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబీకులు, క్షతగాత్రులు, రాష్ట్ర ప్రజలు, వేంకటేశ్వర స్వామి భక్తులు, హైందవ ధర్మాన్ని ప్రతి ఒక్కరినీ క్షమించమని ప్రభుత్వం కోరుతోంది అన్నారు. గురువారం సాయంత్రం పవన్ కల్యాణ్ తిరుపతి చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి నేరుగా తొక్కిసలాట చోటు చేసుకున్న బైరాగిపట్టెడ ప్రాంతంలోని పద్మావతి […]
తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతున్నారు : జగన్
![](https://www.andhrabeats.com/wp-content/uploads/2025/01/IMG-20250109-WA0486-1024x683.jpg)
తిరుపతి పద్మావతి మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించిన తర్వాత అక్కడే మీడియాతో మాట్లాడారు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జగన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు ఇది కచ్చితంగా ప్రభుత్వ తప్పిదం. సీఎం మొదలు, టీటీడీ అధికారులు, ఛైర్మన్, జిల్లా ఎస్పీ, కలెక్టర్ అందరూ బాధ్యులే. అందుకే వారందరిపై కచ్చితంగా చర్యలు చేపట్టాలి. తొక్కిసలాటను తక్కువ చేసి చూపుతూ, తప్పుడు సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. బీఎన్ఎస్ 194–సెక్షన్‌కు బదులు బీఎన్ఎస్ 105– సెక్షన్ కింద […]
భక్తుల మృతి కలిచివేసింది: మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు : చంద్రబాబు
![](https://www.andhrabeats.com/wp-content/uploads/2025/01/IMG-20250109-WA0529-1024x683.jpg)
‘పవిత్ర దివ్యక్షేత్రం తిరుపతిలో జరిగిన బాధాకరమైన ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది. భక్తుల మరణ వార్త విని ఎంతో బాధపడ్డా. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకునేలా టీటీడీ అధికారులను ఆదేశిస్తున్నా. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ఒక వెంకటేశ్వరస్వామి భక్తుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాపై ఉంది. తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణకు ఆదేశిస్తున్నా.’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా బుధవారం జరిగిన తోపులాటలో […]