Andhrabeats

ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసిన భార్య

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది ఒక భార్య. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సోలిశెట్టిపల్లిలో ఈ దారుణం జరిగింది. గోవిందప్ప(38)కు 15 ఏళ్ల కిందట గుడుపల్లి మండలం పెద్దవంకకు చెందిన మీనాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 4 నుంచి భర్త కనిపించడం లేదంటూ 5వ తేదీన మీనా రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. […]

తిరుమలలో రాజకీయ నోళ్లకు తాళాలు

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమల్లోకి వచ్చినట్టు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిజానికి ఎప్పటినుంచో ఈ నిబంధన ఉంది. కానీ ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు. ఇటీవల తిరుమల […]