Andhrabeats

తిరుమలలో 10 రోజులు వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాలు లేవు

వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాల నేప‌థ్యంలో తిరుమ‌ల తిరుప‌తి దేవస్థానం (టీటీడీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. వీఐపీ బ్రేక్ ద‌ర్శ‌నాల‌కు ప‌ది రోజుల పాటు ఎలాంటి సిఫార్సు లేఖ‌లు స్వీక‌రించ‌బ‌డ‌వ‌ని తెలిపింది. అంతేగాక ప్రోటోకాల్ ప్ర‌ముఖులు స్వ‌యంగా వ‌స్తేనే బ్రేక్ ద‌ర్శ‌నాలు ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంద‌ని వెల్ల‌డించింది. వైకుంఠ ద్వార‌ ద‌ర్శ‌నాల్లో సామాన్య భ‌క్తుల‌కు అధిక ప్రాధాన్యత‌ ఇవ్వాల‌నే ఉద్దేశంతో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు టీటీడీ ఈఓ శ్యామ‌ల రావు వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ఈరోజు డ‌య‌ల్ […]

తిరుమలలో రాజకీయ నోళ్లకు తాళాలు

తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమల్లోకి వచ్చినట్టు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిజానికి ఎప్పటినుంచో ఈ నిబంధన ఉంది. కానీ ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు. ఇటీవల తిరుమల […]

జనవరిలో వైకుంఠ ద్వారా దర్శనం.. అర్జిత సేవలు రద్దు

వైకుంఠ ఏకాదశికి తిరుమలలో ఏర్పాట్లు చేస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. జనవరి 10 నుంచి 19 వరకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పించనున్నట్లు పేర్కొన్నారు. ఆ సమయంలో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు, ఆర్జిత సేవలతో పాటు చిన్నారులు, వృద్ధులు, దివ్యాంగులు, ఆర్మీ, ఎన్‌ఆర్‌ఐ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. వీఐపీ ప్రొటోకాల్‌ దర్శనాలకు మాత్రం అనుమతివ్వనున్నారు.