సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన కే విజయానంద్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) కె.విజయానంద్ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం సాయంత్రం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకూ సీఎస్‌గా పని చేసిన నీరబ్ కుమార్ ప్రసాద్ మంగళవారం పదవీ విరమణ చేయగా ఆయన స్థానంలో విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. 1992 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన విజయానంద్‌ను ఏపీ నూతన సీఎస్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29న జీఓ జారీ చేసిన నేపథ్యంలో ఆయన బాధ్యతలు చేపట్టారు. […]