ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసిన భార్య
వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది ఒక భార్య. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సోలిశెట్టిపల్లిలో ఈ దారుణం జరిగింది. గోవిందప్ప(38)కు 15 ఏళ్ల కిందట గుడుపల్లి మండలం పెద్దవంకకు చెందిన మీనాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 4 నుంచి భర్త కనిపించడం లేదంటూ 5వ తేదీన మీనా రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. […]