టీడీపీ మంత్రి పక్కన వైసీపీ మాజీ మంత్రి.. తెలుగు తమ్ముళ్ల రచ్చ రచ్చ
నూజివీడులో జరిగిన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో వైసీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడం వివాదాస్పదంగా మారింది. మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ముఖ్య అతిథులుగా పెద్దఎత్తున ఈ కార్యక్రమం జరిగింది. అందులో వైసీపీకి చెందిన మాజీ మంత్రి జోగి రమేశ్ పాల్గొనడంతో తెలుగు తమ్ముళ్లు నానా రచ్చ చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొలుసు పార్థసారథి, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పక్కన జోగి రమేష్ ఉండడాన్ని టీడీపీ శ్రేణులు […]
వైసీపీ నేత పేర్ని నానికి షాక్
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. నాని నిర్వహిస్తున్న గోడౌన్‌లో రేషన్ బియ్యం గల్లంతు కావడంపై కేసు నమోదయింది. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అద్దెకు తీసుకున్న గోడౌన్‌లో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్‌జీర్ జిలానీ ఆదేశించారు. బియ్యం గల్లంతు విషయంలో నానిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. నాని రూ.1.80 కోట్లు […]