Andhrabeats

ఇంత త్వరగా ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుందనుకోలేదు : వైయస్‌ జగన్‌

ఇడుపులపాయలో కడప కార్పొరేటర్లు, ముఖ్యనేతలతో వైఎస్‌ జగన్‌ సమావేశమయ్యారు, ఈ సమావేశంలో వారినుద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే… ప్రజలకిచ్చిన మాట మీద నిలబడి, ప్రజల కష్టాలను నా కష్టాలుగా భావించి, ప్రజలకు మంచి చేశాం, ఈ రోజు కూడా ప్రతి ఇంటికీ మనం కాలర్‌ ఎగరవేసుకుని వెళ్ళగలుగుతాం, ప్రతి ఇంట్లో మనం చెప్పింది చేశామనే మాట ప్రజల నుంచి వినిపిస్తుంది, ప్రజలు సంతోషంగా మీరు చేశారంటున్నారు, అదే టీడీపీ నాయకులు ఎవరైనా ప్రజల […]

వైఎస్‌ జగన్‌ పరువు నష్టం దావా కేసు- ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన పరువు నష్టం కేసులో ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఢిల్లీ హైకోర్టు సమన్లు జారీ చేసింది. అదానీ గ్రూప్‌ వ్యవహారంలో తనపై తప్పుడు వార్తలు రాసి పరువుకు భంగం కలిగించారంటూ ఆ రెండు పత్రికలపై వైఎస్‌ జగన్‌ రూ.100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. అదానీ గ్రూప్‌ అవినీతి కేసుకు సంబంధించి అమెరికాలో దాఖలు చేసిన అభియోగ పత్రంలో తన పేరు లేకున్నా, ఉన్నట్లుగా కట్టు కథలు […]

ఆ పత్రికలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నా : మాజీ సీఎం జగన్

అదానీ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ బీఐ ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని జగన్ అన్నారు. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదని ఆయన స్పష్టం చేశారు. నాకు లంచం ఆఫర్ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తన పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేవారిపై […]