Andhrabeats

పుష్ప–2కి తెలంగాణ ప్రభుత్వం ఆఫర్లు

తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్‌ పుష్ప 2 చిత్రానికి ఆఫర్లు ప్రకటించింది. అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. టికెట్‌ రేట్ల పెంచడానికి ఆమోదం తెలిపింది. మొదటి మూడు రోజులు భారీగా టికెట్‌ రేట్లను పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 150, మల్టీ ప్లెక్సుల్లో రూ.200 పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్‌ 4న వేసే పెయిడ్‌ ప్రీమియర్లకు అన్ని స్క్రీన్లలో గరిష్టంగా రూ. 800 పెంచుకునే ఛాన్స్‌ ఇచ్చింది. అంటే పెయిడ్‌ ప్రీమియర్‌ చూడాలంటే కనీసం వెయ్యి రూపాయలు పెట్టాల్సిందే.

పుష్ప 2 డిసెంబర్‌ 5న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే. కానీ 4వ తేదీనే రెండు తెలుగు రాష్ట్రాల్లో సాయంత్రం మొదటి షోలు పడనున్నాయి. డిసెంబర్‌ 4న సాయంత్రం పెయిడ్‌ ప్రీమియర్లు వేయనున్నారు. వీటికి ప్రత్యేక అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

డిసెంబర్‌ 4న అయితే సాయంత్రం రెండు షోలకు అనుమతి ఇచ్చింది. డిసెంబర్‌ 5 నుంచి 8 వరకు సింగిల్‌ స్క్రిన్‌లలో రూ. 150, మల్టీ ప్లెక్సులో రూ. 200 పెంచుకునే ఛాన్స్‌ ఇచ్చింది. డిసెంబర్‌ 9 నుంచి 16 వరకు సింగిల్‌ స్క్రీన్‌ లో రూ.105, మల్టీఫ్లెక్స్‌ లో రూ.150 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. ఆ తరువాత డిసెంబర్‌ 17 నుంచి 23 వరకు సింగల్‌ స్క్రీన్‌లో రూ.20, మల్టీఫ్లెక్స్‌ లో రూ.50 పెంచుకునే ఛాన్స్‌ ఇచ్చింది.

దీంతో ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్‌తో పాటు రికార్డు స్థాయిలో కలెక్షన్లు వచ్చేలా ఉన్నాయి. సినిమాకి కాస్త పాజిటివ్‌ టాక్‌ వచ్చినా కూడా ఆర్‌ఆర్‌ఆర్‌ రికార్డులు గల్లంతు అవుతాయంటునారు. పుష్ప 2 వంద కోట్ల షేర్‌ టార్గెట్‌తో నైజాంలో బరిలోకి దిగుతోంది..

TOP STORIES