సర్వే & ల్యాండ్ రికార్డ్స్ విభాగంలో జాయింట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న CH.V.S.N. కుమార్ కు ప్రభుత్వం పదోన్నతి మంజూరు చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
13 జిల్లాలకు బాధ్యత
మల్టీ జోన్–1 పరిధిలోని శ్రీకాకుళం నుండి ఎన్టీఆర్ జిల్లా వరకు 13 జిల్లాలకు కుమార్ రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా పర్యవేక్షణ వహించనున్నారు.
ప్రతిభావంతుడైన అధికారి
-
అమరావతి రాజధానిలో 33 వేల ఎకరాల సర్వే రికార్డు స్థాయిలో పూర్తి చేసి, సీఎం అవార్డు పొందారు.
-
రీసర్వే ప్రాజెక్ట్‌లో 32 వేల చదరపు కిలోమీటర్ల హెలికాప్టర్, డ్రోన్ ఫ్లైలు నిర్వహించారు.
-
గత 5 ఏళ్లలో 25 వేల మందికిపైగా సిబ్బందికి 137 రకాల శిక్షణలు అందించారు.
విద్యా, ఉద్యోగ ప్రస్థానం
-
APPSC 2007 గెజిటెడ్ పరీక్షలో రాష్ట్ర ఫస్ట్ ర్యాంక్ సాధించారు.
-
రైల్వేలో జూనియర్, సెక్షన్ ఇంజనీర్ పరీక్షల్లో కూడా ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సాధించి హ్యాట్రిక్ టాపర్‌గా నిలిచారు.
-
రైల్వేలో 5 ఏళ్ల అనుభవం తర్వాత, సర్వే శాఖలో 18 ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్ నుండి వివిధ కీలక పదవుల్లో సేవలు అందించారు.
సేవా కార్యక్రమాలు – కళాప్రతిభ
-
అనాధాశ్రమాలు, వృద్ధాశ్రమాలు, పేద విద్యార్థుల విద్య కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.
-
మిమిక్రీ, వెంట్రిలోక్విజం కళాకారుడిగా జెమినీ టీవీ, దూరదర్శన్, AIR వేదికలపై ప్రదర్శనలు ఇచ్చారు.
అవార్డులు
-
60కిపైగా రాష్ట్ర, జాతీయ అవార్డులు అందుకున్నారు.
-
లంచాలు లేకుండా నిజాయితీగా పనిచేసే అధికారి గా గుర్తింపు పొందారు.