ఈ రోజుల్లో ఉద్యోగాలు దొరుకుతున్నవి కాదు, నైపుణ్యాలు ఉన్నవాళ్లే ఉద్యోగాల్ని సృష్టిస్తున్నారు.
ఇంటర్నెట్ యుగంలో ఎవరి చేతిలోనైనా మొబైల్ ఫోన్ ఉంటుంది. ఆ మొబైల్ ఫోన్ మనకో ఉద్యోగం ఇచ్చే సాధనంగా మారాలంటే. మనం నైపుణ్యాన్ని సంపాదించాలి.
10 నైపుణ్యాల్లో ఏదో ఒకటి నేర్చుకుంటే మీరు భవిష్యత్తులో సంపన్నుడు కావచ్చు.
1. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అంటే ఏంటి?
మనిషిలా ఆలోచించే కంప్యూటర్‌లను తయారు చేయడమే AI. ఉదాహరణకు – మీరు గూగుల్‌లో టైప్ చేయకముందే అది గెస్ చేసి కనిపెట్టడం, యూట్యూబ్ మీకు నచ్చిన వీడియోలు సిఫారసు చేయడం – ఇవన్నీ AI వల్లే.
ఎందుకు నేర్చుకోవాలి?
ఈ రంగం భవిష్యత్తులో దాదాపు ప్రతి రంగంలోనూ ఉంటుంది. ఉద్యోగాలు కూడా భారీగా ఉంటాయి.
ఏం నేర్చాలి?
- Python అనే కంప్యూటర్ భాష
- AI టూల్స్: TensorFlow, OpenAI
2. మెషిన్ లెర్నింగ్ (Machine Learning)
ఇది కూడా AIలో భాగమే. మనం డేటాను (అంటే సమాచారం) ఇచ్చినప్పుడు, యంత్రాలు దాన్ని అర్థం చేసుకుని కొత్తగా నేర్చుకోవడం — అదే మెషిన్ లెర్నింగ్.
ఉదాహరణ: మీ మొబైల్ ఫోన్‌కి మీరు ఎంతసేపు ఏ యాప్ వాడతారో తెలుసుకొని, దానికి తగ్గ నోటిఫికేషన్లు పంపడం.
ఏం నేర్చాలి?
- డేటా విశ్లేషణ
- Python, Sci-kit Learn అనే టూల్స్
3. సైబర్ సెక్యూరిటీ
మన డేటా (బ్యాంక్ డీటెయిల్స్, ఫోన్ నంబర్లు, ఫోటోలు) ఎవరు దొంగలించకుండా కాపాడే పద్ధతులే సైబర్ సెక్యూరిటీ.
ఎందుకు అవసరం?
ప్రతి కంపెనీకి డేటా రక్షణ అవసరం. అందుకే ఈ రంగంలో ఉద్యోగాలు ఎప్పటికీ ఉండే అవకాశముంది.
ఏం నేర్చాలి?
- Ethical Hacking
- Cyber Security Certificates (CEH, CompTIA)
4. క్లౌడ్ కంప్యూటింగ్
మీ ఫోటోలు, వీడియోలు గూగుల్ డ్రైవ్‌లో స్టోర్ అవుతుంటాయి కదా? అవన్నీ క్లౌడ్‌లో ఉంటాయి. అంటే, కంప్యూటర్‌లో కాకుండా ఇంటర్నెట్ మీదే స్టోర్ అవుతాయి.
ఎందుకు నేర్చుకోవాలి?
ప్రపంచంలోని పెద్ద కంపెనీలు అన్నీ క్లౌడ్ సేవలనే వాడుతున్నాయి. మంచి జీతాల ఉద్యోగాలుంటాయి.
ఏం నేర్చాలి?
- Amazon Web Services (AWS)
- Microsoft Azure, Google Cloud
5. డేటా సైన్స్
రోజు రోజుకీ డేటా పెరిగిపోతోంది. ఆ డేటాను విశ్లేషించి వ్యాపార నిర్ణయాలు తీసుకోవడం – అదే డేటా సైన్స్.
ఉదాహరణ: Flipkart మీకు నచ్చిన వస్తువులే చూపించడం.
ఏం నేర్చాలి?
- Excel, SQL
- Python, R
- Data Visualization tools (Tableau)
6. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)
మీ మొబైల్‌తో మీరు ఇంట్లో లైట్ ఆన్ చేయగలగడం చూసారా? అదే IoT. మిక్సీ, ఫ్యాన్, కారు — ఇవన్నీ ఇంటర్నెట్‌తో కనెక్ట్ కావడమే IoT.
ఎందుకు నేర్చుకోవాలి?
ఈ రంగంలో కొత్తగా వస్తున్న స్మార్ట్ ప్రోడక్ట్స్‌కు డెవలపర్లు, డిజైనర్లు అవసరం.
ఏం నేర్చాలి?
- Arduino, Raspberry Pi
- స్మార్ట్ హార్డ్‌వేర్‌తో ప్రాక్టికల్ ట్రైనింగ్
7. బ్లాక్‌చెయిన్
బిట్‌కాయిన్ విన్నారా? దాని వెనుక ఉన్న టెక్నాలజీ బ్లాక్‌చెయిన్. డేటాను ఎవరూ మార్చలేని విధంగా భద్రపరిచే కొత్త టెక్నాలజీ.
ఎందుకు అవసరం?
బ్యాంకింగ్, హెల్త్‌కేర్, కాంట్రాక్ట్స్ అన్నింటిలో ఇది ఉపయోగపడుతుంది.
ఏం నేర్చాలి?
- Solidity భాష
- Ethereum Blockchain
8. ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) & వర్చువల్ రియాలిటీ (VR)
AR/VR అంటే నిజమైన ప్రపంచంలో డిజిటల్ విషయాలు జత చేయడం. Pokémon GO ఆట గుర్తుందా? అది AR టెక్నాలజీనే.
ఎందుకు అవసరం?
రియల్ ఎస్టేట్, గేమ్స్, ఎడ్యుకేషన్ రంగాల్లో ఇవి విస్తృతంగా వాడుతున్నారు.
ఏం నేర్చాలి?
- Unity Software
- 3D డిజైన్ & కోడింగ్
9. డెవ్‌ఆప్స్ ఇంజనీరింగ్
సాఫ్ట్‌వేర్ తయారుచేసిన వెంటనే అది వినియోగదారుడి దగ్గరికి వెళ్తేనే లాభం. అదే డెవ్‌ఆప్స్ పని.
ఎందుకు నేర్చుకోవాలి?
ఇది అన్ని సాఫ్ట్‌వేర్ కంపెనీలకు అవసరమైన నైపుణ్యం.
ఏం నేర్చాలి?
- Linux, Git
- Docker, Kubernetes
10. క్వాంటం కంప్యూటింగ్
ఈ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన కంప్యూటర్లకు బేస్ ఇది. నార్మల్ కంప్యూటర్లు చేసే పనిని వేల రెట్లు వేగంగా చేస్తుంది.
ఎందుకు ప్రత్యేకం?
ఇది ఇంకా అభివృద్ధి దశలో ఉంది. కానీ రేపటి ప్రపంచాన్ని ఇది ఏలుతుంది.
ఏం నేర్చాలి?
- IBM Qiskit
- Quantum Physics బేసిక్స్
ఈ నైపుణ్యాలు మొదటలో కాస్త కష్టం అనిపించవచ్చు. కానీ ప్రతిరోజూ గంట పాటు కష్టపడి నేర్చుకుంటే, జీతం కోసం ఎదురు చూసే మనిషి కాకుండా, ఇతరులకు జీతం ఇచ్చే స్థాయికి ఎదగవచ్చు.