హైదరాబాద్ కు చెందిన సాగి వెంకట నరసింహ రాజు(54) కి విజయవాడ లోటస్ సెక్టర్-1 పృద్వి అపార్ట్మెంట్ లో ప్లాట్ ఉంది. యనమలకుదురు ప్రాంతానికి చెందిన మహ్మద్ రఫీ. ఇద్దరు చిన్ననాటి స్నేహితులు కావడంతో కలిసి మద్యం సేవించారు. మాట మాట పెరగడంతో మహ్మద్ రఫీ, వెంకట నర్సింహ రాజుని కత్తెరతో పొడవబోయాడు. రాజు తప్పించుకుని తన వద్దనున్న టవల్ తో రఫీ మెడకు వేసి నులిమాడు. దీంతో రఫీ మృతి చెందాడు. ఘటనపై పోలీసులకు నరసింహరాజు ఫోన్ చేయడం విశేషం. తన స్నేహితుడు చావుకు తానే కారణమయ్యానంటూ కన్నీరుమున్నీరయ్యాడు. రఫీ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. ఎందుకు చంపాడో వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్తున్నారు.
మద్యం మత్తులో స్నేహితుణ్ణి చంపేశాడు

RECENT POSTS
-
కోర్ ఇంజనీరింగ్: ఐటీని మించిన కెరీర్ అవకాశాలు -
ఎంపీ పుట్టా మహేష్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు -
బెంగాల్ పీఠంపై దీదీ పట్టు బిగిస్తుందా? దాదా వ్యూహం పారుతుందా? -
IPL 2026: ఒక్కో మ్యాచ్ విలువ ₹150 కోట్లు! -
అల్లు సినిమాస్ వివాదం: 'వాల్ ఆఫ్ గ్రేట్స్'పై చెలరేగుతున్న సోషల్ మీడియా వార్ -
ఏపీ హైకోర్టు సీజేగా తొలి మహిళా లీసా గిల్ ప్రమాణస్వీకారం -
వైసీపీ ఫినిక్స్ పక్షిలా మళ్ళీ లేస్తుందా? అప్రతిహత విజయాల నుండి సంక్షోభం వరకు -
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో భయంకరమైన 'AI' విధ్వంసం -
అమెరికా అంచనా తప్పిందా? యుద్ధం12వ రోజుకు చేరినా లొంగని ఇరాన్! -
ATMకి కార్డ్ మర్చిపోయారా?.. ఇక మొబైల్ ఉంటే చాలు!









