Andhrabeats

ఏపీలో కొత్త రేషన్‌ కార్డులు

ఏపీలో డిసెంబర్‌ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్‌ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్‌ కార్డుల జారీ నిలిపివేసింది. అయితే పార్టీ నేతలు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కొత్త కార్డుల జారీకి సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డుల్లో మార్పులు, చేర్పులు ఇతర సర్వీసులకు సైతం అవకాశం కల్పించనుంది. డిసెంబర్‌ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో […]

సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్

  సంక్రాంతి తర్వాత పార్లమెంట్ యూనిట్ గా జిల్లాల్లో పర్యటిస్తానని జగన్ తెలిపారు. ప్రతి బుధవారం, గురువారం జిల్లాల్లోనే ఉంటానని, రెండు రోజుల పాటు కార్యకర్తలతో మమేకం అవుతానని చెప్పారు. ప్రతీ గ్రామంలో టీడీపీ, చంద్రబాబును ప్రశ్నించాలన్న జగన్.. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ ఏమైందని నిలదీయాలని దిశానిర్దేశం చేశారు. గ్రామ స్థాయి నుంచి ఎంపీ వరకు ఫేస్ బుక్, ఇన్ స్టా, వాట్సాప్ ఉండాలన్నారు. ఎక్కడ అన్యాయం జరిగినా వీడియో తీసి అప్ లోడ్ చేయాలని […]

జేసీ ప్రభాకర్, ఆదినారాయణరెడ్డిలకు చంద్రబాబు పిలుపు

బూడిద తరలింపుపై ఎన్డీఏ కూటమిలోని రెండు వర్గాల మధ్య నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు చంద్రబాబు నడుం బిగించారు. వైఎస్సార్‌ జిల్లాలోని ఆర్టీపీపీ బూడిద తరలింపుపై టిడిపికి చెందిన తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, బిజెపికి చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్‌రెడ్డిలకు ముఖ్యమంత్రి కార్యాలయానికి రావాలని సమాచారం అందింది. ముగ్గురు నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబును శుక్రవారం కలవాలంటూ ఆదేశాలు వచ్చాయి. సిమెంటు పరిశ్రమలకు బూడిద తరలించే విషయంలో జేసీ, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య వివాదం తలెత్తింది. […]

ఆ పత్రికలపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తున్నా : మాజీ సీఎం జగన్

అదానీ వ్యవహారంపై మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎఫ్ బీఐ ఛార్జిషీటులో తన పేరు ఎక్కడా లేదని జగన్ అన్నారు. అదానీతో భేటీకి, విద్యుత్ ఒప్పందాలకు సంబంధమే లేదని ఆయన స్పష్టం చేశారు. నాకు లంచం ఆఫర్ చేసినట్లు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. గురువారం ఆయన తాడేపల్లిలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. వాస్తవాలు తెలియకుండా కొందరు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. తన పరువు, ప్రతిష్టలు దెబ్బతీసేవారిపై […]

ఆర్టీసీ చైర్మన్ కోడలి చీరను ఎత్తుకెళ్లిన ఆర్టీసీ డ్రైవర్

ఆర్టీసీ కార్గోలో కొరియర్ ఇచ్చిన ఖరీదైన చీర మిస్ అయింది. దాంతో పాటు ఉన్న అన్ని పార్శిళ్ళు వచ్చినా ఆ చీర పార్సిల్ మాత్రం గమ్యానికి రాలేదు. అది ఆర్టీసీ చైర్మన్ కోడలికి చెందిన ఖరీదైన చీర కావడంతో అధికారులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. పార్శిళ్లను సకాలంలో పంపిణీ చేస్తుండటంతో చాలామంది ఆర్టీసీ కార్గో సేవల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వినుకొండ డిపోకి రావాల్సిన పార్శిల్ రాకపోవడంతో కార్గో ఉద్యోగులు హైరానా పడుతున్నారు. ఎందుకంత హైరానా […]

ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు.. ఏపీ నుంచి మూడు

  ఏపీలో మూడు.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ హర్యానాలో ఒక్కొక్క రాజ్యసభ స్థానానికి ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. వైఎస్ఆర్సీపీని వీడి తమ రాజ్యసభ స్థానాలకు మోపిదేవి వెంకటరమణ , బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. దీంతో ఆ మూడు స్థానాలకు ఎందుకిలా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 3న నోటిఫికేషన్ జారీ చేస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. డిసెంబర్ 10 నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ కాగా డిసెంబర్ 11న […]