విద్యార్థులతో కలిసి భోజనం చేసిన చంద్రబాబు
బాపట్ల మున్సిపల్ హైస్కూల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థులతో ఉల్లాసంగా గడిపారు. క్లాస్ రూమ్‌లకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పి కష్టపడి చదువుకోవాలని, చదువుకుంటేనే మంచి భవిష్యత్ ఉంటుందని సూచించారు. ఆ తర్వాత విద్యార్థులతో కలిసి కింద కూర్చుని భోజనం చేశారు. చంద్రబాబుతోపాటు ఆయన కుమారుడు, మంత్రి లోకేష్ కూడా ఉన్నారు. బాపట్ల మున్సిపల్ స్కూల్‌లో జరిగిన మెగా పేరెంట్స్–టీచర్స్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నిరంతరం నేర్చుకోవడం […]
వసూళ్లలో ‘ఆర్‌ఆర్‌ఆర్’ రికార్డు బద్దలు కొట్టిన పుష్ప2
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2– ది రూల్ చిత్రం కలెక్టన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలిరోజు వసూళ్లలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం పేరుతో ఉన్న రికార్డును తుడిచిపెట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు సంచలనాలు సృష్టించగా ఇప్పుడు విడుదలయ్యాక మోత కలెక్షన్లలోనూ భారతీయ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.294 కోట్లు వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ […]
వచ్చేసింది మనుషుల వాషింగ్ మెషీన్
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మనుషుల్లో బద్దకం పెరిగిపోతోంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చొని బాన పొట్టలు పెంచుతున్నారు. వాటిని కరిగించేందుకు మళ్లీ జిమ్‌లకు వెళ్తున్నారు. ఇక ఇంట్లో అయితే మొత్తం ఎలక్ట్రిక్ వస్తువులే దర్శనం ఇస్తున్నాయి. కూరగాయలు కోయడం దగ్గరి నుంచి మొదలుపెడితే జుట్టు దువ్వుకోవడం వరకు అన్నీ మెషీన్లే పని చేస్తున్నాయి. టెక్నాలజీ రోజురోజుకూ అప్‌గ్రేడ్ అవుతుంటే.. వాటిని ఉపయోగిస్తున్న మనం మాత్రం దినదినం సోమరిపోతుల్లాగా మారిపోతున్నాం. ఇక ఇలాంటి వాటిని ఆసరాగా […]
బన్నీ విశ్వరూపం : సుకుమార్ సూపర్ నారేషన్ – పుష్ప2 నిజంగా ది రూలే
2021లో పుష్ప ది రైజ్ తెచ్చిన ఊపును దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ గత మూడేళ్లుగా కొనసాగిస్తున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పుష్పరాజ్ పాత్రలో దేశమంతా కూడా ఓన్ చేసేసుకుంది. దీనికి కారణం ముమ్మాటికి సుకుమార్ రైటింగ్స్ ప్రేక్షకులకు ఇచ్చిన పుష్పరాజ్ అనే డ్రగ్. ఇప్పుడు అదే ఫ్రాంచైజీని కంటిన్యూ చేస్తూ పుష్ప ది రూల్ తయారయింది. మూడేళ్లుగా ఈ సినిమాపై వచ్చిన కిక్ అంతా అంతా కాదు. పుష్ప2 సినిమాకి ఉండే అతి […]
నాగచైతన్య, శోభిత పెళ్లి.. నాగార్జున భావోద్వేగం
అక్కినేని నాగచైతన్య ధూళిపాళ్ల శోభిత ఒక్కటయ్యారు. బుధవారం రాత్రి వారి పెళ్లి అంగరంగ వైభవంగా హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. వారి పెళ్లి ఫోటోలను నాగార్జున ఎక్స్ లో పోస్ట్ చేశారు. “శోభిత, చై ఒక అందమైన అధ్యాయాన్ని ప్రారంభించడం నాకు ఎంతో ప్రత్యేకం. ఇది భావోద్వేగమైన క్షణం. నా ప్రియమైన చైకి అభినందనలు. మా కుటుంబంలోకి శోభితను ఆనందంగా ఆహ్వానిస్తున్నాను. ఆమె ఇప్పటికే మా జీవితాల్లో చాలా ఆనందాన్ని తెచ్చింది. ANR గారి శత […]
అమరావతిలో చంద్రబాబు సొంతిల్లు
నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు రెండవసారి పనిచేస్తున్నారు. అయినా ఇప్పటివరకు ఆయన ఏపీలో సొంతిల్లు సమకూర్చుకోలేదు. అమరావతిలోని ఉండవల్లి కరకట్టపై పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్‌కి చెందిన అతిథి గృహాన్ని తన నివాసంగా మార్చుకుని ఏడేళ్లుగా అక్కడే ఉంటున్నారు. దీనిపై చాలా విమర్శలు, వివాదాలు ఉన్నాయి. ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నా ఏపీలో ఇల్లు కట్టుకోలేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన అమరావతిలో సొంతిల్లు ఏర్పాటు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఇటీవల అమరావతిలో ఇంటి స్థలం కొనుగోలు చేశారు. రాజధానిలోని వివిధ […]
పుష్ప2 స్టార్ హోటల్ ఇడ్లీ లాంటిది: రామ్ గోపాల్ వర్మ
‘పుష్ప2: ది రూల్’పై (Pushpa2: The Rule) ఎక్స్ లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్టు చేశారు. ‘పుష్ప2′ టికెట్ ధరలను (Pushpa 2 Tickets Price) పెంచుకునేందుకు తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. భారీగా పెరిగిన టికెట్ ధరలపై కొన్ని వర్గాలు సామాజిక మాధ్యమాల్లో విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్ పెట్టారు. ధరలను నియంత్రించాలని కోరుతూ పలువురు న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారు.’పుష్ప2’ టికెట్లను స్టార్ హోటల్ […]
కంపించిన భూమి.. వణికిన తెలుగు రాష్ట్రాలు
దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలను భూ ప్రకంపనలు నిద్రలేపాయి. రెండు సెకన్లపాటు కంపించిన భూమి అందర్నీ భయాందోళనకు గురి చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భవనాలు షేక్ అవ్వడం అందర్నీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఉదయాన్నే ఆఫీస్కు వచ్చిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాక్ […]
ఏపీలో మద్యం కొనుగోళ్లు ఆపేస్తాం: వైన్స్ ఓనర్స్
ఏపీలో మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రకటించిన 20 శాతం కమీషన్ ఇవ్వాలని వైన్స్, బార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇవాళ కడపలో సమావేశమైన మద్యం షాపుల ఓనర్లు ఈనెల 5న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 14వ తేదీలోపు కమీషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం 9.5 శాతం కమీషన్ ఇస్తున్నారని, దీనితో లైసెన్స్ ఫీజులు కట్టలేమని చెబుతున్నారు.
పెళ్లి పీటలు ఎక్కనున్న పీవీ సింధు
భారత స్టార్ షట్లర్ పీవీ సింధూ త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. హైదరాబాద్ కు చెందిన వ్యాపారవేత్త గౌరవెల్లి వెంకటదత్త సాయితో ఆమె వివాహం జరగనుంది. వెంకట దత్త సాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నారు. పెళ్లి తేదీ, వివాహ వేదిక కూడా నిశ్చయమైంది. ఈ విషయంపై పీవీ సింధూ తండ్రి పీవీ రమణ మాట్లాడుతూ.. ఇరు కుటుంబాలు ఒకరికొకరు చాలాకాలంగా తెలుసు. గత నెలలోనే వీరి పెళ్లికి సంబంధించిన నిర్ణయానికి వచ్చామని చెప్పారు. జనవరి […]