Andhrabeats

‘ఏఐ’తో ఆయుర్దాయం పెరుగుతుంది

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) అన్ని రంగాల్లోనూ సమూల మార్పులు తెస్తోంది. వైద్య రంగంలోనూ వేగంగా చొచ్చుకు వస్తున్న ఏఈ మనిషి ఆయుష్షును పెంచడానికీ దోహద పడుతుందని ప్రఖ్యాత వైద్య నిపుణులు, అమెరికన్‌ సొసైటీ ఆఫ్‌ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్‌ ఎండోస్కోపీ ప్రెసిడెంట్‌ డా. ప్రతీక్‌ శర్మ తెలిపారు. భవిష్యత్తులో వైద్య రంగాన్ని ఏఐ శాసిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా వైద్య సేవలు ప్రజలకు చేరువ చేసే విధానంలో సమూల మార్పులు రాబోతున్నాయని ఆయన చెప్పారు. విశాఖలో జరిగిన డీప్‌టెక్‌ సదస్సులో పాల్గొన్న […]

మెడిసిన్‌ స్ట్రిప్‌పై రెడ్‌ మార్క్‌ ఎందుకు ఉంటుంది?

Red strip in Medicine

ఏదైనా హెల్త్‌ ప్రాబ్లమ్‌ వస్తే, ప్రతి ఒక్కరూ కొన్ని రకాల మెడిసిన్‌ వాడతారు. సమస్య పెద్దదైతే, డాక్టర్‌ సూచించిన మందులు వాడాల్సి ఉంటుంది. అయితే చాలామంది మెడిసిన్‌ రేపర్‌పై ఏం రాసి ఉందో చదవరు. నిజానికి మెడిసిన్‌ స్ట్రిప్స్‌ అన్నింటిపై కొన్ని సూచనలు రాసి ఉంటాయి. వాటిని బట్టి ఆ మెడిసిన్‌ ఎలా వాడాలో, ఎలా భద్రపరచాలో తెలుస్తుంది. కానీ చాలా రకాల మెడిసిన్‌ స్ట్రిప్స్‌పై ఎరుపు రంగు లైన్‌ ఉంటుంది. ఇది దేనికి సంకేతమని ఎప్పుడైనా […]

ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్‌’

దుల్కర్‌ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్‌’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న లక్కీ భాస్కర్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెలుగులో రూపొందిన ఈ సినిమాను మలయాళంలోనూ భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌కి తెలుగులో ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో భారీ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్లుగా నిర్మాత నాగ్‌ అశ్విన్‌ ప్రకటించారు. […]

2025లో జనగణన.. 2028లో పునర్విభజన

జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని వెల్లడించాయి. ప్రతి పది సంవత్సరాలకోసారి ఆనవాయితీగా నిర్వహించాల్సిన జనగణన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. రాష్ట్రాల వారీగా, జాతీయ స్థాయిలో రకరకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు పరచడానికి ఈ జనగణనే […]

చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు

చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ కిండర్‌ గార్టెన్లు (పాఠశాలలు) మూతపడుతున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం 2023లో పాఠశాలల సంఖ్య 14,808 తగ్గి 2,74,400కి పడిపోయిందని చైనా విద్యా మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది. చైనా జననాల రేటు పడిపోవడం తాజా సూచికలో ఇది వరుసగా రెండోసారి. జనాభా సంక్షోభ ప్రభావం ముఖ్యంగా విద్యతోపాటు […]

ఎక్కువ మంది పిల్లల్ని కనండి : ఎలన్‌ మస్క్‌

ఆర్థిక స్థోమత లేదనే కారణంతో పిల్లల పెంచడానికి అయ్యే ఖర్చు గురించి ఆందోళన చెందకుండా వెంటనే పిల్లలను కనాలని బిలియనీర్‌  ఎలన్‌ మస్క్‌ సూచించారు. పిల్లల పెంపకంతో అయ్యే ఖర్చుల గురించే ప్రజలు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు. ఆ ధోరణి మానేసి సంతోషంగా పిల్లల్ని కనడంపై దృష్టి పెట్టాలని మస్క్‌ సూచించారు. పెన్సిల్వేనియాలోని హారిస్‌బర్గ్‌లో జరిగిన ట్రంప్‌ అనుకూల ర్యాలీలో టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సీఈఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన్ను పిల్లలను కనడం గురించి […]

జేసీ దివాకర్‌రెడ్డి ఇంటినే కూల్చేసిన అద్దెకున్న వ్యక్తులు

హైదరాబాద్‌లో మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి ఇంటిని అద్దెకు తీసుకున్న వ్యక్తులు కూల్చివేయడం సంచలనం రేపింది. అంతేకాకుండా దివాకర్‌రెడ్డిని బెదిరించడం చర్చనీయాంశమైంది. ఏడాది నుంచి ఈ ఇంటి కోసం జేసీ కుటుంబానికి, అద్దెకున్న వారికి వివాదం నడుస్తోంది. దివాకర్‌రెడ్డి తనకు జూబ్లీహిల్స్‌లో ఉన్న ఇంటిని సాహితీ లక్ష్మీనారాయణ కొడుకు సాత్విక్‌కు అద్దెకు ఇచ్చారు. అయితే సాత్విక్‌ అదే ఇంటిని జేసీకి తెలియకుండా వేరొకరికి అద్దెకు ఇచ్చారు. తాజాగా అద్దెకు తీసుకున్న వ్యక్తులు జేసీ ఇంటిని కూల్చివేసి వేరే […]

కేటీఆర్‌ బావమరిది ఫాం హౌస్‌లో పోలీసుల దాడులు

రంగారెడ్డి జిల్లా జన్వాడ రిజర్వ్‌ కాలనీలోని బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ బావమరిదికి చెందిన రాజ్‌ పాకాల ఫాం హౌస్‌పై సైబరాబాద్‌ ఎస్వోటీ పోలీసులు దాడులు చేయడం సంచలనంగా మారింది. ఫాం హౌస్‌లో శనివారం రాత్రి పార్టీ నిర్వహించారు. భారీ శబ్దాలతో ఈవెంట్‌ నిర్వహిస్తున్నట్లు డయల్‌ 100 ద్వారా పోలీసులకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఫారిన్‌ లిక్కర్‌ బాటిల్స్‌ను స్వాధీనం చేసుకుని పార్టీలో పాల్గొన్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో […]

సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవడం కోసం ఏం చేయాలి?

అందరూ సెల్ ఫోన్ కి బానిసలు అయిపోయారు, దాంట్లో అనుమానమే లేదు. నేటి సమాజంలో సెల్ ఫోన్ వాడటం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయి, కానీ మనం సెల్ ఫోన్ చూడటం మాత్రం మానడం లేదు .చిన్నపిల్లలైతే మరీ ఎక్కువ అయిపోయారు.,అన్నం తినిపించాలంటే సెల్ ఫోన్ ఏ పనైనా చేయాలంటే సెల్ ఫోన్ అడిక్షన్ తగ్గించుకోవాలంటే మనం రోజుకి ఒక నాలుగైదు గంటలు సెల్ ఫోన్ చూస్తుంటే రెండు గంటలకు తగ్గించుకోవాలి అంటే రోజురోజుకి […]