Andhrabeats

షాకింగ్‌ : కుక్కను వేటకొడవళ్లతో నరికి చంపారు

తిరుపతి నగరంలోని ఫిష్‌ మార్కెట్‌ ఎదురుగా ఉన్న స్కావెంజర్స్‌ కాలనీలో ఓ పెంపుడు శునకాన్ని అదే కాలనీకి చెందిన ఇద్దరు వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపేశారు. కాలనీలో నివాసముంటున్న లావణ్య కొన్నేళ్లుగా శునకాన్ని పెంచుకుంటోంది. శుక్రవారం తిరుచానూరు పంచమి సందర్భంగా ఆమె గుడికి వెళుతూ శునకాన్ని ఇంటి వద్దే వదిలి వెళ్లింది. ఈ క్రమంలో అదే కాలనీకి చెందిన ఇద్దరు వేటకొడవళ్లతో అత్యంత కిరాతకంగా ఆ మూగజీవి ప్రాణం తీశారు. రోడ్డుపై వెళుతున్న వారిని చూసి […]

ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసిన భార్య

వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది ఒక భార్య. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం సోలిశెట్టిపల్లిలో ఈ దారుణం జరిగింది. గోవిందప్ప(38)కు 15 ఏళ్ల కిందట గుడుపల్లి మండలం పెద్దవంకకు చెందిన మీనాతో వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. ఈ నెల 4 నుంచి భర్త కనిపించడం లేదంటూ 5వ తేదీన మీనా రాళ్లబూదుగూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన పోలీసులు రెండు రోజుల్లోనే కేసును ఛేదించారు. […]

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వైద్యులు మృతి

అనంతపురం జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విడపనకల్లు వద్ద కారు అదుపు తప్పి చెట్టును ఢీకొన్న సంఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలంలో కారు నుజ్జునుజ్జు కాగా మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. దట్టమైన మంచు వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. మృతులు బళ్లారికి చెందిన ఓపీడీ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు యోగేశ్, గోవిందరాయ, అమరేశ్‌ గుర్తించారు. వీరంతా హాంకాంగ్‌ విహారయాత్రకు […]

డిజిటల్‌ అరెస్టు.. 1.78 కోట్లు పోగొట్టుకున్న యువతి

సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. పోలీసులు, సైబర్‌ నిపుణులు ఎన్ని జాగ్రత్తలు చెబుతున్నా కొందరు మాత్రం నేరగాళ్ల ఉచ్చులో పడి డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు. తాజాగా ముంబైలో ఒక యువతి ఏకంగా రూ.1.78 కోట్లను చేజార్చుకుంది. ముంబైలోని బోరీవాలి ఈస్ట్‌కు చెందిన ఓ యువతికి నవంబర్‌ 19న ఒక ఫోన్‌ వచ్చింది. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల నుంచి ఫోన్‌ చేస్తున్నామని దుండగులు ఆమె పేరు, అన్ని వివరాలు చెప్పారు. ప్రస్తుతం జైలులో ఉన్న జెట్‌ […]

అమెరికాలో దారుణం.. తెలుగు విద్యార్థిపై కాల్పులు

అమెరికాలో జరిగిన కాల్పుల్లో ఖమ్మం జిల్లాకు చెందిన యువకుడు సాయి తేజ మృత్యువాతపడ్డాడు. దీంతో అతని కుటుంబంలో విషాదం నెలకొంది. ఖమ్మం రాపర్తి నగర్‌ కు చెందిన సాయి తేజ ఎంఎస్‌ చదివేందుకు నాలుగు నెలల క్రితమే అమెరికాలోని చికాగో వెళ్లాడు. అక్కడే పార్ట్‌ టైమ్‌ జాబ్‌ చేస్తున్నారు. శుక్రవారం దుండగులు ముసుకు వేసుకుని వచ్చి సాయి తేజను డబ్బులు డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇచ్చిన తర్వాత సాయి తేజ ఛాతిపై కాల్చి పారిపోయారు. బుల్లెట్‌ గుండెకు […]

విశాఖలో బస్సు పై యాసిడ్ దాడి.. ముగ్గురు మహిళలకు గాయాలు

విశాఖపట్నంలో ఆర్టీసీ బస్సుపై గుర్తుతెలియని వ్యక్తి యాసిడ్ బాటిల్ తో దాడి చేశాడు. ఓ గుర్తుతెలియని వ్యక్తి ఆ బస్సుపై యాసిడ్ విసిరాడు. అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలపై అది పడింది. ఈ ఘటన విశాఖపట్నంలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. విశాఖలోని ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి బీఆర్టీఎస్ రహదారిపై ప్రయాణిస్తున్న 28ఎ/జీ ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తి యాసిడ్ విసిరాడు. దీంతో బస్సులో కిటికీ పక్కన […]

డాక్టరేట్‌ను నిరాకరించిన రాహుల్‌ ద్రవిడ్‌

  డాక్టరేట్‌ రేట్‌ ఎంత గొప్పవాడైనా ఎగిరి గంతేసి స్వీకరిస్తారు. ప్రముఖ వెటరన్‌ క్రికెటర్, మాజీ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం ఇస్తానంటే తీసుకోనని సున్నితంగా తిరస్కరించి తాను స్పెషల్‌ అని మరోసారి నిరూపించుకున్నాడు. రాహుల్‌ ద్రావిడ్‌ని బెంగుళూరు యూనివర్సిటీ  గౌరవ డాక్టరేట్‌ పట్టాతో సన్మానించాలనుకుంది. కానీ దానిని అతడు గౌరవంగా  నిరాకరించాడు. తాను ఆటల మీద భవిష్యత్తుల్లో ఏదో ఒక రోజు పరిశోధనా వ్యాసాలు రాసి పట్టా తీసుకుంటానని చెప్పాడు తన భార్య డాక్టర్‌ అని […]

ఒక్క రోజు ముందుగానే ’లక్కీ భాస్కర్‌’

దుల్కర్‌ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ’లక్కీ భాస్కర్‌’ సినిమా ఈనెల 31న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీపావళి సందర్భంగా విడుదల కాబోతున్న లక్కీ భాస్కర్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. తెలుగులో రూపొందిన ఈ సినిమాను మలయాళంలోనూ భారీ ఎత్తున విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. దుల్కర్‌ సల్మాన్‌కి తెలుగులో ఉన్న క్రేజ్‌ నేపథ్యంలో భారీ రిలీజ్‌కి ప్లాన్‌ చేస్తున్నట్లుగా నిర్మాత నాగ్‌ అశ్విన్‌ ప్రకటించారు. […]

2025లో జనగణన.. 2028లో పునర్విభజన

జనగణనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని, 2026 వరకు కొనసాగవచ్చని తాజాగా ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం లోక్‌సభ స్థానాల పునర్విభజన ప్రక్రియ ప్రారంభమవుతుందని, అది 2028కి ముగుస్తుందని వెల్లడించాయి. ప్రతి పది సంవత్సరాలకోసారి ఆనవాయితీగా నిర్వహించాల్సిన జనగణన మూడేళ్లుగా ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. రాష్ట్రాల వారీగా, జాతీయ స్థాయిలో రకరకాల అభివృద్ధి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు రూపొందించి అమలు పరచడానికి ఈ జనగణనే […]

చైనాలో జనాభా సంక్షోభం.. మూతపడుతున్న వేలాది స్కూళ్లు

చైనా తీవ్ర జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. కొద్దికాలంగా చైనాలో జననాల రేటు గణనీయంగా తగ్గిపోతూ వస్తోంది. దేశ వ్యాప్తంగా పిల్లల నమోదు గణనీయంగా తగ్గడంతో వేలాది ప్రసిద్ధ కిండర్‌ గార్టెన్లు (పాఠశాలలు) మూతపడుతున్నాయి. అధికారిక నివేదిక ప్రకారం 2023లో పాఠశాలల సంఖ్య 14,808 తగ్గి 2,74,400కి పడిపోయిందని చైనా విద్యా మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక పేర్కొంది. చైనా జననాల రేటు పడిపోవడం తాజా సూచికలో ఇది వరుసగా రెండోసారి. జనాభా సంక్షోభ ప్రభావం ముఖ్యంగా విద్యతోపాటు […]