ఓజీని ఓవర్టేక్ చేసిన కాంతారా

తెలుగు సినిమా ప్రేమికులకు ‘ఓజీ’ (OG), ‘కాంతారా: చాప్టర్ 1’ రెండు విభిన్న రుచులతో వడ్డించిన సినిమాటిక్ విందులు. ఒకవైపు పవన్ కళ్యాణ్‌తో స్టైలిష్ మాస్ యాక్షన్ డ్రామా, మరోవైపు రిషబ్ శెట్టితో సాంస్కృతిక, దైవిక అనుభవం. ఈ రెండు సినిమాలు ఒకదానికొకటి భిన్నమైన శైలులతో ఆకట్టుకుంటాయి. ఏది మీ గుండెల్లో గుర్తుండిపోతుందో చూద్దాం! OG: పవన్ కళ్యాణ్ మాస్ మ్యాజిక్ సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘ఓజీ’ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక రోలర్‌కోస్టర్ రైడ్. […]
టాలీవుడ్‌కి ₹1,000 కోట్ల నష్టం

2025 మొదటి ఆరు నెలలు తెలుగు సినిమా పరిశ్రమకు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. స్టార్ హీరోలు, వందల కోట్ల బడ్జెట్‌తో రూపొందించిన భారీ సినిమాలు వరుసగా విఫలమయ్యాయి. జనవరి నుండి జూన్ వరకు రిలీజ్ అయిన 40 సినిమాల్లో కేవలం మూడు మాత్రమే లాభాల్లోకి వెళ్లాయి. మిగిలినవి అన్నీ డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలకు తీవ్ర నష్టాలు మిగిల్చాయి. పరిశ్రమ మొత్తానికి దాదాపు రూ.1,000 కోట్ల నష్టం వాటిల్లిందని ఇండియా టుడే నివేదిక చెబుతోంది. నిలబెట్టిన మూడు సినిమాలు 1. […]
వీరమల్లు ఎలా ఉంది? పర్ఫెక్ట్ రివ్యూ

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన మొట్టమొదటి పిరియాడిక్ హిస్టారికల్ వార్ డ్రామా హరిహర వీరమల్లు.. సుమారు ఐదేళ్ల పాటు నిర్మాణంలో ఉన్నా కూడా ఎక్కడా క్రేజ్ తగ్గని చిత్రం. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ప్రారంభమైన ఈ సినిమాను నిర్మాత ఏయం రత్నం తనయుడు,గతంలో నీ మనసు నాకు తెలుసు, ఆక్సిజన్ మరియు రీసెంట్గా రూల్స్ రంజన్ చిత్రాల దర్శకుడు జ్యోతి కృష్ణ పూర్తి చేశారు. ముందుగా క్రిష్, ఆ తర్వాత జ్యోతి కృష్ణ కలసి […]
క్లైమాక్స్‌లో షాక్, కథలో సాధారణం : అర్జున్ సన్నాఫ్ వైజయంతి సమీక్ష

‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ 2025 ఏప్రిల్ 18న విడుదలైన ఒక తెలుగు యాక్షన్ డ్రామా చిత్రం. నందమూరి కల్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం, తల్లీకొడుకుల మధ్య భావోద్వేగ సంఘర్షణను యాక్షన్ నేపథ్యంలో చిత్రీకరించింది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో, అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు నిర్మించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథ వైజయంతి (విజయశాంతి) ఒక కమిటెడ్ సీనియర్ పోలీస్ అధికారిణి. తన కొడుకు అర్జున్ (కల్యాణ్ రామ్) […]
నితిన్ హీరోయిజం, వెంకీ కుడుముల మార్క్ కామెడీ

తెలుగు సినిమా పరిశ్రమలో కామెడీ, యాక్షన్ మిక్స్‌తో ప్రేక్షకులను అలరించడంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకీ కుడుముల. చలో, భీష్మ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత, నితిన్‌తో కలిసి తీసిన రాబిన్‌హుడ్ సినిమా మార్చి 28, 2025న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటించగా, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమా, హీస్ట్ కామెడీ […]
మళ్ళీ ప్రభాస్ పెళ్లి కుదిర్చారు !

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి నెటిజెన్లు మళ్ళీ పెళ్లి కుదిర్చారు. ఒక పారిశ్రామికవేత్త కుమార్తెతో ఆయన పెళ్లి ఖరారు అయినట్లు కొన్ని ప్రసార మాధ్యమాలు, సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. ఆయన పెళ్లి గురించిన ఊహాగానాలు గత కొన్నేళ్లుగా తెలుగు సినీ అభిమానుల్లోనే కాక, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారాయి. ఇటీవల మరోసారి ప్రభాస్ పెళ్లి గురించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. నిరంతరాయంగా సాగుతున్న పెళ్లి పుకార్లు ప్రభాస్‌కు 45 ఏళ్లు వచ్చినా […]
‘రాబిన్‌హుడ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్ సందడి

ఆస్ట్రేలియా క్రికెట్ స్టార్ డేవిడ్ వార్నర్ హైదరాబాద్‌లో సందడి చేశారు. తన తొలి తెలుగు సినిమా “రాబిన్‌హుడ్” ప్రమోషన్స్‌లో భాగంగా నగరానికి చేరుకున్న వార్నర్, అభిమానులతో పాటు సినీ ప్రియులను ఉత్సాహపరిచారు. ఈ సినిమాలో వార్నర్ ఒక ముఖ్యమైన కామియో పాత్రలో కనిపించనున్నారు, ఇది ఆయన తొలి భారతీయ సినిమా కావడం విశేషం. హైదరాబాద్‌లో ఘన స్వాగతం మార్చి 22 రాత్రి హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (RGIA) ల్యాండ్ అయిన వార్నర్‌కు చిత్ర బృందం […]
కుంభమేళాలో పూసలమ్మే మొనాలిసా స్టార్ అయిపోయింది

సామాజిక మాధ్యమాలు ఎందరినో వెలుగులోకి తెస్తున్నాయి. మట్టిలోనే ఉండిపోయిన ప్రతిభావంతులు, కళాకారులను వెలికితీస్తున్నాయి. తాజాగా కుంభమేళాలో ఒక మట్టిలో మాణిక్యం బయటకు వచ్చింది. కానీ మీడియా ఆమెను వేధిస్తున్న తీరుతో ఆమె కుటుంబం తల్లడిల్లిపోతోంది. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం ప్రయోగ్ రాజ్ లో జరుగుతున్న మహా కుంభమేళాలో ఎక్కువగా వైరల్ అయిన 16 ఏళ్ళ యువతి “మొనాలిసా”. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ కి చెందిన మొనాలిసా మహా కుంభమేళాలో రంగురంగుల పూసలు రుద్రాక్షలు అమ్ముతూ ఒక యూట్యూబ్ […]
సినిమావాళ్లకు అంత దాసోహం ఎందుకు?

తెలంగాణ ప్రభుత్వాన్ని చూసైనా ఆంధ్రప్రదేశ్ సర్కార్ తీరు మార్చుకోవడంలేదు. గేమ్ చేంజర్, డాకూ మహరాజ్ సినిమా టికెట్ల ధరలు పెంచుకోడానికి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్, నందమూరి బాలకృష్ణ హీరోగా వస్తున్న డాకూ మహరాజ్ సినిమాలు సంక్రాంతి సందర్భంగా విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలకు బెనిఫిట్ షోలు వేసుకోడానికి, టికెట్ రేట్లు పెంచుకోడానికి నిర్మాతలు అనుమతి కోరడం, తదనుగుణంగా ఏపీ ప్రభుత్వం అనుమతి ఇవ్వడం […]
వసూళ్లలో ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బద్దలు కొట్టిన పుష్ప2

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2– ది రూల్ చిత్రం కలెక్టన్లలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. విడుదలైన తొలిరోజు వసూళ్లలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం పేరుతో ఉన్న రికార్డును తుడిచిపెట్టేసింది. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విడుదలకు ముందు సంచలనాలు సృష్టించగా ఇప్పుడు విడుదలయ్యాక మోత కలెక్షన్లలోనూ భారతీయ సినీ పరిశ్రమను ఉలిక్కిపడేలా చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తొలిరోజు రూ.294 కోట్లు వసూళ్లు సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ […]