చైనా పేల్చిన ఆర్థిక బాంబ్ — డాలర్ రాజ్యం కూలిపోతోందా?

చైనా తీసుకున్న డిజిటల్ యువాన్ నిర్ణయం ప్రపంచ ఆర్థిక పటాన్ని మార్చేస్తోంది. అమెరికా ఆధిపత్యంలో నడుస్తున్న డాలర్ స్విఫ్ట్ వ్యవస్థకు ఇది సవాల్. 7 సెకన్లలో చెల్లింపులు, తక్కువ ఖర్చు.. దీన్ని డీ–డాలరైజేషన్ దిశలో చైనా వేసిన చరిత్రాత్మక అడుగుగా ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. అమెరికా ఆధిపత్యానికి ముగింపు — డిజిటల్ యువాన్తో గ్లోబల్ ఫైనాన్స్లో కొత్త యుగం చైనా ప్రపంచ ఆర్థిక పటాన్ని తారుమారు చేసే మరో భారీ అడుగు వేసింది. అమెరికా […]
నాలా రద్దు నిర్ణయం: వ్యవసాయం బలికావడమేనా?

రాష్ట్రంలో వ్యవసాయ రంగం భవిష్యత్తు ముప్పులో పడిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, ‘నాలా’ (Non-Agricultural Land Act) చట్టాన్ని రద్దు చేయడానికి వేగంగా చర్యలు తీసుకోవడం రైతు సంఘాల్లో ఆగ్రహం రేపుతోంది. రైతాంగానికి నాలా చట్టం రక్షణగా 2006లో అమల్లోకి వచ్చిన ఈ చట్టం ప్రకారం – వ్యవసాయ భూమిని ఇతర ప్రయోజనాలకు మార్చాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. భూ మార్పిడి చేసుకునే వారు 5% పన్ను చెల్లించాలి. నియంత్రణ లేకుండా […]
ధర్మస్థల రహస్యం : గుండెలవిసే నిజాలు

కర్ణాటకలోని పవిత్ర పుణ్యక్షేత్రం ధర్మస్థలం, దశాబ్దాలుగా ఆధ్యాత్మిక శాంతి యొక్క చిహ్నంగా నిలిచింది. కానీ ఒక దళిత వ్యక్తి యొక్క ఒక ఆర్తనాదం ఈ పుణ్యక్షేత్రం యొక్క నీడలో దాగిన భయానక నిజాలను వెలుగులోకి తెచ్చింది. 1995 నుంచి 2014 వరకు ఆలయ పరిసరాల్లో పారిశుధ్య కార్మికుడిగా పనిచేసిన ఈ వ్యక్తి అపరాధ భావంతో కుమిలిపోతూ అధికారుల ముందుకు వచ్చాడు. “వందలాది మృతదేహాలను పూడ్చిపెట్టాను, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు” అని అతను వెల్లడించినప్పుడు, ఆ […]
ప్రపంచంలో ఉద్యోగాలు: పొలాల నుంచి టెక్ లోకంలోకి ఉద్యోగాల పయనం

ప్రపంచంలో ఎక్కడ ఎక్కువ ఉద్యోగాలు ఉన్నాయి? గతంలో ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి, 2030 నాటికి ఎలా ఉంటాయి? ప్రపంచంలో ఉద్యోగాల పరిస్థితి ప్రపంచంలో ఉద్యోగాలు ఎప్పుడూ మారుతూ ఉంటాయి. గతంలో పొలాల్లో పని చేసే రైతులు ఎక్కువగా ఉండేవారు. ఇప్పుడు బ్యాంకులు, షాపులు, ఆన్లైన్ సేవలు, టెక్ కంపెనీలు ఉద్యోగాలను ఇస్తున్నాయి. రేపు యంత్రాలు, ఆరోగ్య సంరక్షణ, గ్రీన్ ఎనర్జీ రంగాలు ముందుంటాయి. గతం, ఇప్పుడు, రేపు ఎలా ఉందో చూద్దాం. గతం (1991-2020) […]
ట్రంప్ సుంకాల షాక్.. భారత్ వాణిజ్యం దెబ్బతింటుందా?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మన భారత్ నుంచి వచ్చే వస్తువులపై 25% సుంకం (టాక్స్) విధించారు. ఇప్పుడు మరో 25% పెంచారు, అంటే మొత్తం 50% సుంకం! దీనివల్ల మన దేశం నుంచి అమెరికాకు వెళ్లే వస్తువులు ఖరీదైపోతాయి. ఈ సుంకాలు ఎందుకు, ఎవరిపై, ఎందుకు మారింది, ఇంతకు ముందు ఏం జరిగింది, ఇప్పుడు ఏం అవుతుందో సామాన్యుడికి అర్థమయ్యేలా చెప్పుకుందాం. సుంకాలు ఎందుకు వచ్చాయి? ట్రంప్ అన్నారు, “భారత్ రష్యా నుంచి చమురు, ఆయుధాలు […]
ఘోషిస్తున్న బెజవాడ

“Drones, AI, CCTV Cameras.. etc etc” లాంటి ‘గంభీరమైనవేవీ” లేక ముందే అంటే సుమారు 35 సంవత్సరాల క్రితమే మా బెజవాడ చాలా డీసెంట్ గా ఉండేది! దాదాపు ప్రతి ముఖ్యమైన కూడలిలో “ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్, ట్రాఫిక్ పోలీసులు” ఉండేవారు, “వన్ వే” నిబంధనలు నిక్కచ్చిగా అమలయ్యేవి! కానీ.. ఏ క్షణాన “రాజధాని” మా దగ్గరికి వచ్చిందో గానీ.. దానివల్ల మాకు కొత్తగా ఒరిగింది గుండు సున్నా! అప్పటి వరకు మా పాట్లేవో మేము […]
అడవుల గుండెలో పులుల రాగం: 3,682 గర్జనల కథ

మన దేశంలో పులుల గర్జనలు మరోసారి గంభీరంగా వినిపిస్తున్నాయి. ప్రపంచంలోని పులుల్లో సగానికి పైగా భారత్లోనే ఉండటం విశేషం. ఒకప్పుడు అంతరించిపోయే దశకు చేరిన ఈ గంభీర వన్యప్రాణుల సంఖ్య గణనీయంగా పెరిగింది, దశాబ్దాల కృషి ఫలించడమే ఇందుకు కారణం. ప్రాజెక్ట్ టైగర్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన వన్యప్రాణుల సంరక్షణ కార్యక్రమాల్లో ఒకటిగా నిలిచింది. ప్రపంచ పులుల దినోత్సవం సందర్భంగా, భారత్లో పులుల సంరక్షణ చరిత్ర, దాని విజయాలు ఆసక్తికరంగా, గర్వకారణంగా నిలుస్తున్నాయి. వందేళ్ల క్షీణత […]
ఏపీకి కర్నాటక పనికిరాని ఏనుగులు ఎందుకిచ్చింది?

కర్నాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన నాలుగు కుంకీ ఏనుగులు పనికిరానివని తేలింది. వాటిని భరించలేక, మేపలేక అక్కడి ప్రభుత్వం ఆ ఏనుగుల్ని ఏపీకి అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద ఘనతగా ప్రచారం చేసుకుని ఇప్పుడు కిక్కురుమనడంలేదు. తీసుకువచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా నిర్వహించలేదు. దీన్నిబట్టే వాటి సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతోంది. తమిళనాడు, కర్నాటక సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు, ఒడిస్సా సరిహద్దులో ఉన్న […]
‘సంఘీయులు’ కాకపోతే.. అంతే సంగతి…!

‘నయా ముల్లా జ్యాదా ప్యాజ్ ఖాయా’ అని హిందీ లో ఓ సామెత.. ఇస్లాం మతం లోకి కొత్తగా మారిన బ్రాహ్మణుడు తాను ముస్లిం అని అందరికీ చెప్పుకోడానికి ఎక్కువ ఉల్లిపాయలు తింటాడు అని అర్థం. ఆర్ ఎస్ ఎస్, ఇతర సంఘ్ పరివార్ నేపథ్యం లేకుండా బీజేపీలో చేరే నేతల పరిస్థితి కూడా అంతే. తాను బీజేపీ సిద్ధాంతాన్ని నమ్ముతున్నా… పాటిస్తున్నా… నేనూ బీజేపీ మనిషినే అని రోజూ నిరూపించుకుంటూ ఉండాలి. అంతవరకు ఏ పార్టీ […]
తెలంగాణలో ఆంధ్రా విద్యార్థుల అగచాట్లు

ఇంజనీరింగ్ విద్య కోసం కోటి ఆశలతో తెలంగాణా వెళ్లిన ఆంధ్రా విద్యార్థుల వెతలు వర్ణనాతీతంగా వున్నాయి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టుగా తెలంగాణలో ఆంధ్రా ఇంజనీరింగ్ విద్యార్థుల పరిస్థితి కానవస్తుంది. క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు వగైరా సదుపాయాలు ఆశించి తెలంగాణకు వెళ్లిన ఏపీ విద్యార్థులకు నిరాశ ఎదురవుతుంది. రెండేళ్లుగా ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్ లో వుండడంతో విద్యార్థులు తీవ్ర అగచాట్లు కు గురవుతున్నారు. ఫీజు కోసం కళాశాల […]