ఓ పుట్టినరోజు… ఓ నాయకత్వ గాథ!

2025 ఏప్రిల్ 20న, ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో అగ్రగామిగా నిలిచిన నారా చంద్రబాబు నాయుడు తన 75వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ (టీడీపీ) జాతీయ అధ్యక్షుడిగా, ఆయన రాజకీయ జీవితం విజయాలు, సవాళ్లు, వివాదాలు, కుటుంబ బంధాలు, అసాధారణ వ్యూహాలతో నిండిన ఒక సినిమాటిక్ కథలా సాగింది. రాజకీయ సామ్రాజ్యంలో నాలుగుసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేయడం కేవలం రాజకీయ అవకాశం కాదు. అది ఆయన రాజకీయ తెలివి, […]
వైసీపీలో అవమానాలు, కోటరీ పాలిటిక్స్ : విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చారు. పార్టీలో తాను అనుభవించిన అవమానాలు, కోటరీ ఆధిపత్యం, లిక్కర్ స్కాం విచారణపై జరిపిన ప్రశ్నలకు సమాధానాల అంశాలపై ఆయన బహిరంగంగా మాట్లాడారు. మీడియాతో జరిగిన సమావేశంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. “నన్ను నెంబర్ 2 స్థానం నుంచి… 2000 స్థానానికి దించారు” వైసీపీ లో తాను నెంబర్ 2 స్థానంలో ఉన్నా, […]
ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ : గంటా నిర్వేదం

టీడీపీ సీనియర్ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం నుంచి అమరావతి వెళ్లడానికి పడే ఇబ్బందుల గురించి ప్రస్తావిస్తూ నిర్వేదం వ్యక్తం చేశారు. ‘ఆంధ్రా టు ఆంధ్రా వయా తెలంగాణ’ అంటూ ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అమరావతి చేరాలంటే తెలంగాణ రాజధాని హైదరాబాద్ మీదుగా వెళ్లాల్సి రావడం బాధాకరం.. ఉదయం 8 గంటలకు విశాఖ ఎయిర్ పోర్టు వచ్చిన నేను విమానంలో […]
ఏపీ కేబినెట్ సమావేశం: కీలక నిర్ణయాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో 24 ముఖ్యమైన అజెండా అంశాలపై సుదీర్ఘ చర్చ జరిగింది. ముఖ్య నిర్ణయాల వివరాలు 1. పరిశ్రమలకు భూమి కేటాయింపు రాష్ట్రంలో ఉద్యోగ అవకాశాలను పెంచే దిశగా మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలోని ఐటీ హిల్-3 ప్రాంతంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) […]
వైఎస్ భారతిపై ఐ టీడీపీ కార్యకర్త అసభ్య వ్యాఖ్యలు: గోరంట్ల మాధవ్ దాడి యత్నంతో ఉద్రిక్తత

ఏపీ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపై తెలుగుదేశం పార్టీకి ఐ టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ చేసిన అనుచిత, అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ ఘటన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ చేబ్రోలు కిరణ్‌పై దాడి చేసేందుకు ప్రయత్నించడం, ఆ తర్వాత అతని అరెస్టుతో పరిస్థితి మరింత ఉద్విగ్నంగా మారింది. కిరణ్ అడ్డగోలు వ్యాఖ్యలు […]
సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల్లో స్లాట్ బుకింగ్‌తో రిజిస్ట్రేషన్లు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో దస్తావేజులు రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం ప్రారంభమైంది. శుక్రవారం అమరావతి సచివాలయంలో రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఈ విధానాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో స్లాట్ బుకింగ్ సేవలను ప్రారంభించినట్లు చెప్పారు. రిజిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ అధికారిక వెబ్‌సైట్‌లో స్లాట్ బుకింగ్ మాడ్యూల్ ద్వారా ఏ రోజు వీలుంటే ఆరోజు ఆ సమయానికి కొచ్చి రిజిస్ట్రేషన్ […]
కొడాలి నానికి సీరియస్ : ప్రత్యేక విమానంలో ముంబయి ఆస్పత్రికి తరలింపు

గుండెపోటు గురైన వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి కొడాలి నాని (54)ని (శ్రీ వెంకటేశ్వరరావు) ఆరోగ్య పరిస్థితి పార్టీ వర్గాలు, అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. మెరుగైన చికిత్స కోసం ఆయన్ను సోమవారం హైదరాబాద్‌లోని ఏఏజీ ఆస్పత్రి నుంచి ప్రత్యేక విమానంలో ముంబయికి తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. మార్చి 25వ తేదీన ఆయనకు గుండె సంబంధిత సమస్యలు […]
పేదలను ఆదుకునే మిషన్ పీ-4 : చంద్రబాబు

ఆదుకునే మిషన్ పీ4 అని, సమాజంలో ఈ కార్యక్రమం గేమ్ ఛేంజర్ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పీ4 ఒక మహత్తర కార్యక్రమం అని, చరిత్ర సృష్టించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని అన్నారు. అమరావతి రాజధానిలో ఆదివారం పీ4 కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లోగోను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజాసేవకే నా జీవితం అంకితం తెలుగువారి తొలి పండుగ ఉగాది రోజున ఏ కార్యక్రమం […]
రెడ్‌బుక్ తెరవగానే కొందరికి గుండెపోటు వచ్చింది : లోకేష్

రెడ్‌బుక్ తెరవగానే కొందరికి గుండెపోటు వచ్చిందని, కొంతమంది బాత్‌రూమ్‌లో జారిపడ్డారని ఐటీ, విద్యా శాఖల మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో శనివారం జరిగిన టీడీపీ 43వ ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడుతూ మరో 40 ఏళ్లు టీడీపీ జెండాను రెపరెపలాడిస్తామన్నారు. గల్లీ రాజకీయాలు చూశామని, ఢిల్లీ రాజకీయాలు శాసించామని, క్లైమోర్ మైన్స్‌కే భయపడలేదని, కామెడీ పీస్‌లకు భయపడతామా అని ప్రశ్నించారు. ఈవీఎం అయినా, బ్యాలెట్ అయినా గెలుపు మనదేనని చెప్పారు. మూడు పర్యాయాలకు […]
20 లక్షల కుటుంబాలను ధనికులు దత్తత తీసుకోవాలి : చంద్రబాబు

రాష్ట్రంలో సంపన్నవర్గాల వారు పేదలకు సాయం అందించేందుకు వీలుగా ప్రభుత్వం పీ4 విధానం ద్వారా ప్లాట్‌ఫామ్ నిర్మిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఉగాది రోజున ప్రారంభించే జీరో పావర్టీ – పీ4 విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. సాయం అందించేందుకు ఎవరైనా ముందుకు రావొచ్చని, ఎవరినీ ఇందుకోసం ఒత్తిడి చేయొద్దని అధికారులకు సూచించారు. ఎన్నారైలు కూడా పీ4లో భాగస్వాములు కావొచ్చని.. గతంలో తన హయాంలో చేపట్టిన జన్మభూమి తరహాలోనే పీ4 కార్యక్రమానికి […]