వచ్చేసింది మనుషుల వాషింగ్ మెషీన్
టెక్నాలజీ పెరిగిపోతున్న కొద్దీ మనుషుల్లో బద్దకం పెరిగిపోతోంది. కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌ల ముందు గంటల తరబడి కూర్చొని బాన పొట్టలు పెంచుతున్నారు. వాటిని కరిగించేందుకు మళ్లీ జిమ్‌లకు వెళ్తున్నారు. ఇక ఇంట్లో అయితే మొత్తం ఎలక్ట్రిక్ వస్తువులే దర్శనం ఇస్తున్నాయి. కూరగాయలు కోయడం దగ్గరి నుంచి మొదలుపెడితే జుట్టు దువ్వుకోవడం వరకు అన్నీ మెషీన్లే పని చేస్తున్నాయి. టెక్నాలజీ రోజురోజుకూ అప్‌గ్రేడ్ అవుతుంటే.. వాటిని ఉపయోగిస్తున్న మనం మాత్రం దినదినం సోమరిపోతుల్లాగా మారిపోతున్నాం. ఇక ఇలాంటి వాటిని ఆసరాగా […]
కంపించిన భూమి.. వణికిన తెలుగు రాష్ట్రాలు
దక్షిణాది రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల ప్రజలను భూ ప్రకంపనలు నిద్రలేపాయి. రెండు సెకన్లపాటు కంపించిన భూమి అందర్నీ భయాందోళనకు గురి చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ఈ భూ ప్రకంపనల ప్రభావం కనిపించింది. ఉదయాన్నే తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు. ఒక్కసారిగా భవనాలు షేక్ అవ్వడం అందర్నీ భయపెట్టింది. ముఖ్యంగా హైదరాబాద్లోని ఉదయాన్నే ఆఫీస్కు వచ్చిన వాళ్లు ఆందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక ఒక్కసారిగా షాక్ […]
ఏపీలో మద్యం కొనుగోళ్లు ఆపేస్తాం: వైన్స్ ఓనర్స్
ఏపీలో మద్యం షాపుల టెండర్ కు ముందు ప్రకటించిన 20 శాతం కమీషన్ ఇవ్వాలని వైన్స్, బార్ల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఇవాళ కడపలో సమావేశమైన మద్యం షాపుల ఓనర్లు ఈనెల 5న ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ కు నోటీస్ ఇవ్వాలని నిర్ణయించారు. ఈనెల 14వ తేదీలోపు కమీషన్ పెంపుపై నిర్ణయం తీసుకోకపోతే మద్యం కొనుగోళ్లు ఆపేస్తామని వారు హెచ్చరించారు. ప్రస్తుతం 9.5 శాతం కమీషన్ ఇస్తున్నారని, దీనితో లైసెన్స్ ఫీజులు కట్టలేమని చెబుతున్నారు.
విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు లైన్ క్లియర్
విశాఖ, విజయవాడ మెట్రోరైల్ ప్రాజెక్టుల తొలిదశ డీపీఆర్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖ తొలిదశలో 11 వేల 498 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 46 కిలోమీటర్ల మేర 3 కారిడార్లను నిర్మించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34 కిలోమీటర్లు ఒకటో కారిడార్, గురుద్వార నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5 కిలోమీటర్లు 2వ కారిడార్, తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేర్ వరకు 6 కిలోమీటర్లు 3వ కారిడార్ నిర్మించనున్నారు. రెండో దశలో కొమ్మాది […]
25 నుంచి ఏపీలో టీచర్ల బదిలీల ప్రక్రియ
ఏపీలో ప్రభుత్వ టీచర్ల ప్రమోషన్లు, బదిలీలకు కసరత్తు మొదలైంది. ఈ నెల 25వ తేదీ నుంచి బదిలీల ప్రక్రియను మొదలుపెట్టనున్నారు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఈ ప్రక్రియ చేపడుతున్నారు. జులైలో మిగిలిన అన్ని శాఖల బదిలీలు చేపట్టినా టీచర్ల బదిలీలు మాత్రం చేయలేదు. ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వారి బదిలీలను ప్రత్యేకంగా తీసుకుని ఇప్పుడు రోడ్‌మ్యాప్ ప్రకటించింది ఏపీ విద్యా శాఖ. ఇదీ రోడ్ మ్యాప్ – డిసెంబర్ 25, జనవరి […]
జనవరి 13 నుంచి మహా కుంభమేళా
హిందువులు అత్యంత ప్రధాన పండగ అయిన మహాకుంభమేళా 2025 జనవరి 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 26వ తేదీ వరకు ప్రయాగ్ రాజ్ లో అత్యంత ఘనంగా జరగనుంది. భారతీయ ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పెద్ద పండగ ఇది. ప్రపంచంలోనే అత్యధిక మంది హాజరయ్యే కార్యక్రమం మహాశివరాత్రి రోజున చివరి రాజ స్నానంతో కూడా ముగుస్తుంది. గంగా, యమునా, అదృశ్య సరస్వతి నదుల ఒడ్డున ఉన్న ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనుంది. మహా కుంభమేళా భారతదేశంలో అతిపెద్ద మతపరమైన […]
6 లైన్లుగా కోస్తా జాతీయ రహదారి–216
కోస్తా జాతీయ రహదారి – 216ని విస్తరించేందుకు కేంద్ర ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి నుంచి ఒంగోలు వరకూ రహదారి ఉండగా రెండు దశల్లో విస్తరించాలని యోచిస్తున్నారు. తొలి దశలో కత్తిపూడి నుంచి కృష్ణా జిల్లా మచిలీపట్నం వరకు 229 కిలోమీటర్ల మేర ప్రస్తుతం ఉన్న రహదారిని ఆరు లైన్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. రెండో దశలో మచిలీపట్నం నుంచి ఒంగోలు వరకు విస్తరణ పనులు చేయాలని భావిస్తున్నారు. కాకినాడ పోర్టు ఇప్పటికే అభివృద్ధి చెందగా, […]
ఏపీలో కొత్త రేషన్ కార్డులు
ఏపీలో డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో నూతన రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల జారీ నిలిపివేసింది. అయితే పార్టీ నేతలు, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో కొత్త కార్డుల జారీకి సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు ఇతర సర్వీసులకు సైతం అవకాశం కల్పించనుంది. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయాల్లో […]
దేశంలో 25 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు
ఒకప్పుడు ప్రపంచాన్ని వణికించిన ఎయిడ్స్ ప్రజల్లో అవగాహన పెరగడంతో తగ్గుముఖం పడుతోంది. మన దేశంలోనూ ఎయిడ్స్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 25 లక్షల మంది ఎయిడ్స్ బాధితులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఎయిడ్స్ వ్యాప్తిలో మిజోరం తొలి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో దీని వ్యాప్తి 2.73 శాతంగా ఉంది. రెండు, మూడు స్థానాల్లో నాగాలాండ్ (1.37%), మణిపూర్ (0.87%) ఉన్నాయి. 4, 5 స్థానాల్లో ఏపీ, (0.62%), తెలంగాణ (0.44%) […]
తిరుమలలో రాజకీయ నోళ్లకు తాళాలు
తిరుమలలో రాజకీయ ప్రసంగాలపై నిషేధం అమల్లోకి వచ్చినట్టు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) ప్రకటించింది. కొంతమంది రాజకీయ నాయకులు దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ విమర్శలు, ప్రసంగాలు చేయడం పరిపాటిగా మారిందని తెలిపింది. తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధిస్తున్నామని పేర్కొంది. నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించింది. నిజానికి ఎప్పటినుంచో ఈ నిబంధన ఉంది. కానీ ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు. ఇటీవల తిరుమల […]