Andhrabeats

పుష్ప–2కి తెలంగాణ ప్రభుత్వం ఆఫర్లు

తెలంగాణ ప్రభుత్వం అల్లు అర్జున్‌ పుష్ప 2 చిత్రానికి ఆఫర్లు ప్రకటించింది. అదనపు షోలకు అనుమతి ఇచ్చింది. టికెట్‌ రేట్ల పెంచడానికి ఆమోదం తెలిపింది. మొదటి మూడు రోజులు భారీగా టికెట్‌ రేట్లను పెంచుకునే అవకాశం ఇచ్చింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో రూ. 150, మల్టీ ప్లెక్సుల్లో రూ.200 పెంచుకునే అవకాశం కల్పించింది. డిసెంబర్‌ 4న వేసే పెయిడ్‌ ప్రీమియర్లకు అన్ని స్క్రీన్లలో గరిష్టంగా రూ. 800 పెంచుకునే ఛాన్స్‌ ఇచ్చింది. అంటే పెయిడ్‌ ప్రీమియర్‌ చూడాలంటే కనీసం […]

మేనరికాలు మస్తు డేంజర్‌

చాలామంది బావా మరదళ్లు, లేదంటే మావయ్యను, కజిన్స్‌ని పెళ్ళి చేసుకోవడం మన దేశంలో చాలాచోట్లే జరిగేదే. ఇలా చేసుకోవడం వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతాయని సైన్స్‌ చెబుతోంది. దీన్ని కాన్‌శాన్‌గ్వినిటీ అని పిలుస్తారు. కాన్‌శాన్‌గ్వినిటీ అంటే రక్త సంబంధం, దగ్గర బంధువులను వివాహం చేసుకోవడం. ఈ తరహా పెళ్ళిళ్లు భారత్‌లో సుమారు 13.6 శాతం జరుగుతున్నాయి. దక్షిణ భారతదేశంలో అత్యధికంగా 53 శాతం ఇలాంటి వివాహాలే జరుగుతున్నాయని లెక్కలు చెబుతున్నాయి. దక్షిణ భారత దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో […]

ఎంజీఆర్, ఎన్టీఆర్‌లా ఎదుగుతా : తమిళ హీరో విజయ్‌

తమిళ రాజకీయాల్లోకి మరో కొత్త పార్టీ ఆవిర్భించింది. సినీ హీరోగా మొదలై రాష్ట్ర రాజకీయాల్లోకి అడుగుపెట్టారు తమిళ హీరో విజయ్‌. విల్లుపురంలో నిర్వహించిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీ తొలి మహానాడులో విజయ్‌ మొదటి ప్రసంగంతోనే ఇరగదీశారు.ఈ సమావేశంలో పార్టీ కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. ఒక కుటుంబం రాష్ట్రాన్ని లూటీ చేస్తోందని డీఎంకేను విమర్శించారు. తాను రాజకీయాల్లో ఒక చిన్నపిల్లాడినని, కానీ, భయపడను.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు. రాజకీయాల్లో తాను ఎందుకు […]

ఏపీలో ఇక వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు

ఏపీ ప్రభుత్వం ప్రజలకు పౌరసేవల్ని వాట్సాప్ ద్వారా అందించేందుకు సిద్దమయింది. ఈ మేరకు మెటాతో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందం ప్రకారం ప్రభుత్వం తరపున చేసే పౌరులకు అందే సేవల్లో సింహభాగం వాట్సాప్ ద్వారానే అందుతాయి. అంటే సర్టిఫికెట్లు మంజూరు దగ్గర నుంచి చిన్న చిన్న పనులకు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయనున్నారు. యువగళం పాదయాత్రలో నారా లోకేష్ కు యువత నుంచి ఎక్కువగా వచ్చిన ఫిర్యాదు.. తమకు కావాల్సిన కులం, ఆదాయం […]

ప్రపంచ భవిష్యత్ నగరం – హైదరాబాద్ 

హైదరాబాద్ ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో ఒకటిగా ఉంది. గ్లోబల్ సర్వేలను పరిశీలించినపుడు, ఒక సర్వే ప్రకారం హైదరాబాద్ 5వ స్థానం లో ఉండగా, మరో సర్వే ప్రకారం 4వ స్థానంలో ఉంది. బ్రిటీష్ రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వహించిన సర్వేల్లో కూడా, హైదరాబాద్ టాప్-10 అభివృద్ధి చెందుతున్న నగరాల్లో స్థానం సంపాదించింది.  ఈ అధ్యయనాలు ప్రపంచవ్యాప్తంగా 230 నగరాలను పరిశీలించి రూపొందించబడ్డాయి. అందరి అభిప్రాయాలు ఒకేలా ఉన్నై – 2018 లో […]

మీ ప్రేమాభిమానాలు వెయ్యి బంగారు పతకాల కంటే ఎక్కువ

– స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ కష్ట సమయంలో తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ భారత స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫోగట్‌ వినమ్రతతో కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ఒలింపిక్స్‌ అనంతరం తొలిసారి దేశానికి వచ్చిన ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో అభిమానులు శనివారం పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి ఆమె తన స్వగ్రామమైన బలాలి చేరేవరకు ఏకంగా 135 కిలోమీటర్ల దూరం ర్యాలీగా కొనసాగారు. ఆ మార్గమంతా వీఐపీ కాన్వాయ్‌ని తలపించడం […]